రాథోడ్ శ్రావణ్ రచించిన బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్ పుస్తకావిష్కరణ..

రాథోడ్ శ్రావణ్ రచించిన బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్ పుస్తకావిష్కరణ..

రాథోడ్ శ్రావణ్  రచించిన బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్  పుస్తకావిష్కరణ
___________________________________
 
ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు  రచయిత, ఉపన్యాసకులు రాథోడ్ శ్రావణ్ రచించిన  బంజారా జాతి రత్నం బానోత్ జాలం పుస్తకాన్ని ‌తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,  దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  శ్రీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,‌జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ,రాథోడ్ జనార్ధన్  చేతుల మీదుగా 12 జనవరి 2022న ఘనంగా ఆవిష్కరించారు. రాజకీయ నాయకులు, గాంధేయవాది ‌పోరాట యోధుడు,  సంఘసంస్కర్తగా పేరు గడించిన స్వర్గీయ బానోత్ జాలం సింగ్ విగ్రహావిష్కరించిన  తదనంతరం ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం స్థానిక ఏకలవ్య ఆదర్శ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆత్రం సక్కు, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గోడం నగేష్, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కోవా లక్ష్మీ, ఐటిడిఎ చైర్మన్ కనక లక్కేరావు, మైనారిటీ ఫక్స బోర్డు సభ్యులు ఇనుస్ అక్ఖబాని, నార్నూర్ సర్పంచ్ బానోత్ గజానన్, మాజీ జెడ్పీటీసీ నానోభా పుష్కర్, బానోత్ సూరేష్ ,
 ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, కోశాధికారి డాక్టర్ ఇందల్ సింగ్, కవులు  చౌహాన్ పరమేశ్వర్, గురుభక్త కవి తొడసం నాగోరావు ,పవార్ వినోద్ కుమార్, జాలం సింగ్ పెద్ద కుమారుడు బానోత్ సూరజ్ సింగ్, కుటుంబ సభ్యులు రచయితను అభినందించారు.ఈ కార్యక్రమంలో ‌అభిమానులు, బంధుమిత్రులు బంజారా సమాజ ప్రముఖులు,  తదితరులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments