ముత్యాల హారం ప్రక్రియలో జ్యోతి కిరణాలు ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ

ముత్యాల హారం ప్రక్రియలో జ్యోతి కిరణాలు ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ

 జ్యోతి కిరణాలు ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ
----------------------------------------

ఆదిలాబాదు:- ఆదిలాబాదు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు లో  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ  కవయిత్రి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ‌శ్రీమతి జ్యోతి వైద్య గారు  ముత్యాల హార ప్రక్రియలో రచించిన *జ్యోతి కిరణాలు ముత్యాల హారాలు*  అనే పుస్తకాన్ని గెజిటెడ్  ప్రధానోపాధ్యాయురాళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ ప్రక్రియను ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్  రూపొందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ పుస్తకానికి  ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ మరియు కొలిపూర ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి.నీలాదేవి సమీక్ష నిర్వహించారు.అనంతరం  నీలాదేవి మాట్లాడుతూ  తెలుగు సాహితీ రంగంలో ముత్యాల హారం అనే ప్రక్రియ అనేక మంది కవులకు గొప్ప వరమని కొనియాడారు. గతంలో కూడా ఈ ప్రక్రియలో  ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి కుటుంబ సభ్యులతో పాటు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాందా టి ఉపాధ్యాయురాలు శ్రీమతి శశికళ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుంకిడి ఉపాధ్యాయురాలు శ్రీమతి సులోచన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరస్వతి నగర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి మంజుల,, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కజ్జర్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి పద్మజ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బజార్ హత్నూర్ శ్రీమతి ప్రత్యూష,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఖోడద్‍ ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కృష్ణ కూమారి,  విశ్రాంత ప్రధానోపాధ్యాయినులు శ్రీమతి వాసంతి, శ్రీ మతి విజయలక్ష్మి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హిందీ అధ్యాపకురాలు శ్రీమతి సరిత మొదలు వారు పాల్గొని కవయిత్రిని అభినందించారు. ఈ సందర్భంగా కవయిత్రి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, స్నేహితులు అభినందించారు.

0/Post a Comment/Comments