రాథోడ్ శ్రావణ్ ను జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం

రాథోడ్ శ్రావణ్ ను జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం


          రచయిత రాథోడ్ శ్రావణ్ ను‌ జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం 2023 వరించింది. ప్రపంచ నీటి దినోత్సవం 22 మార్చి 2023 ను పురస్కరించుకోని గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, గాంధీ జ్ఞాన ప్రతిస్థాన్  మరియు హైదరాబాద్ మహా నగర జల మండలి సంయుక్తంగా నిర్వహించిన  జల పరిరక్షణ కవితోత్సవమును ఆదివారము రోజున  క్లబ్ హౌజ్ మినిస్టర్ క్యార్టర్స రోడు నెంబర్ 12 బంజారాహిల్స్ హైదరాబాద్ ఘనంగా నిర్వహించారు. సాహితి రంగంలో కృషి చేస్తూ  జలగళం పై వచన కవితను చదివి ప్రతిభను చూపించినందుకు  రచయిత, ఉపన్యాసకులు, ఉట్నూరు సాహితి వేదిక పూర్వ అధ్యక్షులు  అయిన రాథోడ్ శ్రావణ్ కు  గాంధీ గ్లోబల్ ఫ్యామిలి చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రేడ్డి, డా. యాణాల ప్రభాకర్ రెడ్డి, కన్వీనర్ కె. గోపాల్ జీ,తోపాటు ముఖ్య అతిథిగా హాజరైన   తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షులు పాసం యాదగిరి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరి శంకర్ చేతుల మీదుగా శాలువా మెమెంటో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి హైదరాబాదు అధికారి సత్యనారాయణ,ప్రముఖ కవి రచయిత డా.నాగసూరి వేణుగోపాల్, సినీ గీత రచయిత  నంది అవార్డు గ్రహీత సాదనాల వేంకట స్వామి నాయుడు మహిళ కార్యదర్శి వాణిదేవి రమాదేవి కులకర్ణి,  కవులు రచయితలు, బాల కవులు సాహితీ అభిమానులు, గాంధీ గ్లోబల్  ఫ్యామిలి కుటుంబ సబ్యులు  తదితరులు పాల్లొన్నారు.

0/Post a Comment/Comments