వెన్నెల ముత్యాల హారాలు పుస్తక సమీక్ష:-

వెన్నెల ముత్యాల హారాలు పుస్తక సమీక్ష:-

పుస్తక సమీక్షకులు- రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా

గురువు గుర్రాల లక్ష్మారెడ్డి ముత్యాల హార వేదికలో చేరినప్పుడు నుండి నాకు సుపరిచితులు. వయస్సు రిత్యా నేను గురువుగా సంబోధిస్తుంటాను. అయిన గొప్ప బాలసాహితీ వేత్త.తెలుగు సాహిత్యం మీద మక్కువతో  ఏడుపదుల వయస్సులో కూడా సాహితీ రంగంలో రాణించడం గర్వించదగ్గ విషయం.
 బాలల కోసం ‌బాల గేయాలు, కవితలు, పద్యాలు, కథలు, నాటికలు లిఖించిన బాల బంధు అతడు.బాల్యం నుండే సాహిత్యం పట్ల ఆసక్తి కనబరిచి, బాలల కోసం  బాల గీతాలు అయిన "వెన్నెల జల్లులు, వెన్నెల కలువలు, వెన్నెల కెరటాలు,‌వెన్నెల వలువల"  మొదలగు  సంకలనాలు వెలువరించిన సాహితీమూర్తి గౌll శ్రీ, గుర్రాల లక్ష్మారెడ్డి గారు_ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 1946 జనవరి 16 న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి/శ్రీ  చిన్నమ్మ, వెంకట్రామిరెడ్డి.మానవతా విలువలు, దేశభక్తి, గాంధేయవాభావన కలిగిన వెంకట్రామిరెడ్డి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.గుర్రాల లక్ష్మారెడ్డి   ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న కాలంలో తెలుగులో "ప్రతిభ,చేతన" అను రెండు మాస పత్రికను ప్రారంభించాడు.1981 నుండి 1994 వరకు దాదాపు పదమూడేళ్ళు కల్వకుర్తి రచయితల సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు.మాతృభాష తెలుగే ఆయన కృషి పట్టుదలతో హీంది భాషల్లో పాండిత్యం సంపాదించాడు. తన జీవితం కాలంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.ఇతని సేవలను గుర్తించిన ప్రభుత్వం రెండు సార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు పురస్కారంతో సత్కరించింది.
 తెలుగు భాష  మాధుర్యం లోని రుచి నిచ్చే మధురమైన మకరందాన్ని స్వీకరిస్తూ హాయిని అనుభవిస్తూ తెలుగు తల్లి మెడలో సాహస్రాధిక ముత్యాల హారాలు లిఖించి  "సాహస్ర రత్న ముత్యాల హార పురస్కారం" అందుకున్నారు.

ఈ పోత్తంలోని రెండు ముత్యాల హారాలను పరిశీలిద్ధాం:-
---------------------------------------------------------------

"ఆట పాటలు ఆడు/అందరితో కలిసి నేడు/మెచ్చరు అంతా చూడు/ వస్తారు నీకు తోడు..!
నేటి ఆధునిక కాలంలో బాలబాలికలు  చదువుతో పాటు ఆటలలో కూడా రాణించాలని ఈ ముత్యాల హారం ద్వారా తెలియజేశారు.

"రామాయణం చదువు/‌సీతమ్మ ఇందు‌వధువు/గ్రోలు ఈకావ్య మధువు/తడి చేసుకో నీ పెదవు..!"
చదువు వలన అనేక జ్ఞానం లభిస్తుంది. కనుక
భారతీయుల పవిత్రమైన ఆది కావ్యం రామాయణం  చదవడం వలన మంచి   గుణాలును ఆచరించి గొప్ప వాడిగా ఎదుగుతావు అని వివరించారు.
"సాయిబాబా దయ చూడు/హారతి ఇస్తున్నాం నేడు/ నీవేగా మా తోడు/ ఇక మమ్ముల కాపాడు..!"
ఒ సాయి మా పై దయ చూపి కరుణించు స్వామి మమ్ముల్ని ఎల్ల వేళలా కాపాడుతు తోడుగా నీడగా నిలవాలని కవి సాయిబాబా ను వెడుకుంటూన్నాడు.

"చిలిపి దొంగ కృష్ణుడు/ దొంగాట ఆడుతున్నడు/రేపల్లె లో ఉంటాడు/తిక మక పెడుతుంటడు"

ఈ ముత్యాల హారంలో శ్రీ కృష్ణుడి చిలిపి చేష్టలను చాలా చక్కగా వర్ణించారు.  


1969లో ప్రత్యేక తెలంగాణ కొసం ప్రారంభమైన తొలి దశ,2001లో ప్రారంభమైన  మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.2002లో పదవీ విరమణ చేసిన గుర్రాల లక్ష్మారెడ్డి ప్రముఖ రచయితల పాటల పేరడిలు, వివిధ దిన పత్రికలో కవితలు, కథలు, వ్యాసాలు రాస్తుంటారు. ఇప్పటి వరకు నాల్గు సంకలనాలను ఆవిష్కరించిన రచయిత "వెన్నెల ముత్యాల హారాలు"  పుస్తకంతో పుస్తకాల సంఖ్య ఐదు కు చేరడం సంతోషం.ప్రతి పుస్తకం యొక్క శీర్షిక  వెన్నెల  పదంతో  ఉండడం విశేషం. వెన్నెల కాంతులతో ప్రకాశిస్తూ మరిన్ని రచనలు రాయాలని కోరుతూ గురువు గుర్రాల లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
వెల:80/-
ప్రతులకు:-
గుర్రాల లక్ష్మారెడ్డి
రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
ఇం నెం 12-241
విద్యానగర్ కాలనీ, కల్వకుర్తి
నాగర్ కర్నూల్ జిల్లా.509324

పుస్తక సమీక్షకులు:-
రాథోడ్ శ్రావణ్
కవి, రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు  ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ. 504311
చరవాణి సంఖ్య:- 9491467715.

0/Post a Comment/Comments