ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏమిటి?

ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏమిటి?

ఎం ఎల్.సి అంటే ఏమిటి?వాటి ఎన్నికల తీరును వివరించిన సివిక్స్ లెక్చరర్ వి.శేషారావు
చాలామందికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు కానీ అసలు ఎమ్మెల్సీ అంటే ఎవరు? ఏ విధంగా ఎంపిక అవుతారు వాటి వివరాలు చాలామందికి తెలియదు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో రెండు సభలు ఉంటాయి ఒకటి విధాన సభ రెండోది విధాన పరిషత్ సామాన్య ప్రజలకు ఎమ్మెల్యే అంటేనే అవగాహన ఉంటుంది కానీ ఎమ్మెల్సీ పట్ల సాధారణ ప్రజలకు అవగాహన ఉండదు. రాజ్యాంగంలోని 169 ప్రకారం రాజ్యసభను పోలిన విధానమండలి ఏర్పాటు చేస్తారు ఒక రాష్ట్రంలో విధానమండలి ఏర్పాటు కొనసాగింపు లేదా రద్దు అనేది ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది ఒక రాష్ట్రంలో కొత్తగా విధాన మండలి ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్ర శాసనసభ రెండు బై మూడు వంతు మెజారిటీతో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపుతుంది పార్లమెంట్ ఒక 171 ప్రకారం ఏర్పాటు చేస్తుంది లేదా రద్దు చేయమని తీర్మానం చేస్తే రద్దు చేస్తుంది ఎన్టీఆర్ ప్రభుత్వం 1985లో దీన్ని రద్దు చేశారు తిరిగి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2014లో ఏర్పాటు చేశారు ఇది అధికారం అధికారంలో ఉన్న పార్టీ పైన ఆధారపడి ఉంటుంది దీని నిర్మాణం గమనించినట్లయితే రాజ్యాంగం ప్రకారం 40 మంది సభ్యులకు తక్కువ కాకుండా ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యులలో ఒకటి బై మూడు వంతుకు మించకుండా ఉండాలి ప్రస్తుతం తెలంగాణ విధానంలో 40 మంది సభ్యులు ఉన్నారు దీని సభ్యులను పరోక్ష ప్రాతినిత్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు మామూలుగా బ్యాలెట్ గాని ఈవీఎం లో కానీ ఒక ఓటు మాత్రమే వినియోగిస్తాం ఇక్కడ దానికి భిన్నంగా ఉంటుంది రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియను దీనిలో కూడా ఉపయోగిస్తారు హెయిర్ పద్ధతి జాబితా పద్ధతులు అని ఉంటాయి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల వివరాలు బ్యాలెట్ లో ఉంటాయి అయితే వేసే వ్యక్తి  ప్రాధాన్యత సంఖ్యను సూచించాలి ప్రాధాన్యత సంఖ్యలు ఒకటి నుండి చివరి వరకు సూచించవచ్చు ఉదాహరణకు పోటీ చేసే అభ్యర్థులకు ఒకరు ఒక ప్రాధాన్యత మరొకరు మరో ప్రాధాన్యత ఇస్తారు దీనిలో కోటా ఓట్లను నిర్ణయించి ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 51% పైన పోట్లు లభిస్తే విజేతగా ప్రకటిస్తారు ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు రానట్లయితే అతి తక్కువగా ఏ అభ్యర్థి కైతే రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయో అభ్యర్థి ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు ఈ విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది మనదేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను ఇదే పద్ధతిని అనుసరిస్తారు మన దేశంలో రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా వి వి గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు విధానమండలి దీన్నే రాష్ట్రంలో ఎగువ సభ విధాన పరిషత్ అని కూడా అంటారు మనదేశంలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక బీహార్ రాష్ట్రాలలో రెండు సభలు ఉన్నాయి ఈ సభకు ఈ క్రింది విధమైన సభ్యులను ఎంపిక చేస్తారు ఒకటి బై మూడు వంతు సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఒక్కటి బై మూడవ సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు ఒకటి బై ఆరవంతి సభ్యులను రాష్ట్ర గవర్నర్ మంత్రి మండలి సూచన మేరకు నియమిస్తాడు ఒకటి బై 12 అంత మంది సభ్యులను ఉపాధ్యాయ వర్గాల నుండి ఎన్నుకుంటారు ఒకటి బై 12వ వంతు పట్టణ నియోజకవర్గాల నుండి ఎన్నుకుంటారు ఈ విధమైన ప్రక్రియ ద్వారా విధానమండలి ఏర్పడుతుంది విధానమండలికి సభ్యులు ఒక చైర్మన్ ఒక డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు రాజ్యసభ మాదిరిగా ఆర్థిక అధికారుల విషయంలో నామమాత్రపు అధికారాలు ఉంటాయి సాధారణ అధికారాల్లో రెండు సభలకు ఒకే మాదిరిగా ఉంటాయి అయితే రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటు కొనసాగింపు పై ఎటువంటి నియంత్రణ ఉండదు. కేవలం అనుభవజ్ఞులైన మేధోపరమైనటువంటి శక్తిని ఉపయోగించుకోవడానికి ఏర్పాటైన సభ అయితే వాస్తవంలో రాజకీయ పార్టీలు తమ నిరుద్యోగితను పూర్తి చేయించుకోవడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

[13/03, 7:30 pm] PEDDOLLA RAJINIKANTH RAO: 👍

0/Post a Comment/Comments