హోళి పండుగ ముత్యాల హారాలు
------------------------------------------------------
1)
హోళి రంగుల పండుగా
కులమతాలకు అండగా
హోళి జరుపును ఘనంగా
నృత్యం చేస్తూ హాయిగా
2)
హోళి పండుగవేడుకలు
స్నేహితుల పలకరింపులు
మోదుగ పువ్వుల రంగులు
చల్లుకుంటున్న యువతులు
3)
సమాజానికి పండుగలు
వచ్చే వసంత ఋతువులు
వాతావరణ మార్పులు
మోదుగ చెట్ల పుష్పాలు
4)
పురాణాల ప్రకారం
హోళికా కామదహనం
ఇది చెడు మీద విజయం
తరతరాల ఆచారం
5)
మన ధులండి సంబరాలు
నారింజ పసుపు రంగులు
నీళ్ళు చిమ్మేగొట్టాలు
ఒకరి పై ఒకరి జల్లులు
6)
రంగుల రంగోలి హోళి
రంగుల హరివిల్లు హోళి
కన్నుల పండుగ హోళి
రంగుల పండుగ హోళి
7)
రంగుల రసాయినాలు
వచ్చే చర్మ వ్యాధులు
మండెను కళ్ళ మంటలు
వచ్చేను అంధకారాలు
8)
హోళి ప్రత్యేక పాటలు
కొద్దిగ తాగే మందులు
చిందులు వేసె యువకులు
మద్యం ధర రెండింతలు
9)
హోళి అంటు కేరింతలు
డాన్సుల మధ్య వేడుకలు
హోళి పండుగ మంటలు
రాక్షసి బొమ్మకు నిప్పులు
10)
ప్రత్యేక మైన పూజలు
సౌభాగ్య మైన రోజులు
సంతోషంగా ప్రజలు
ఆనందం చిరునవ్వులు
11)
మన గ్రామీణ వాసులు
ఆడ మగ చిన్నారులు
అందరు ఆడె నృత్యాలు
తెలుపెను శుభాకాంక్షలు
12)
హోళి పిండి వంటలు
హోళి భోగి మంటలు
హోళి డోలు డప్పులు
చుట్టు తిరుగు భక్తులు
13)
ఫాల్గుణ మాసం వచ్చే
వెన్నెల పౌర్ణమి తెచ్చే
హోళి రంగులను పంచే
అనంద హద్దులు మించ్చె
14)
హోళి జాజిరి జాజిరి
రంగులు ఎన్నో పూసిరి
పాటలు ఎన్నో పాడిరి
కానుకలు ఎన్నో అడగిరి
15)
పాటలు పాడుతు పిల్లలు
అడిగెను నగదు డబ్బులు
ఖుషితో ఇచ్చే పెద్దలు
వాటితో కొనే రంగులు
రాథోడ్ శ్రావణ్
ముత్యాలహారం రూపకర్త.పూర్వ అధ్యక్షులు
ఉట్నూరు సాహితీ వేదికకు ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా