సీతమ్మ

సీతమ్మ

సీతమ్మ అంటే ఎవరు?
వివరిoచిన కవి, లెక్చరర్ ఉమాశేషారావు వైద్య

జనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీత మ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు! కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి!! జనకుడికి నాగేటిచాలులో దొర క్కముందు,రామయ్యనుమనువా డక ముందు కూడా ఆమె శక్తిస్వరూపిణియే ఐదువేలమం ది బలిష్టులైన సైనికుల చేత  తీ సుకరాబడిన శివధనుస్సునుసీ తమ్మ ఎడమ చేతితో పక్కకుజ రిపిబంతినితీసుకుని ఆటలాడుకున్న తల్లి ఆమె!మహామాయా స్వరూపిణి మహాశక్తిస్వరూపిణి సీతమ్మ!అంతే కాదు ఆమె పేరు తోఒకఉపనిషత్తేఉంది అందు లో ఆమె అసలు సిసలైన స్వ రూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!సీతోపనిషత్తు అ ధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మ. దేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహా త్యా న్ని గురించి వివరించిన విష యాలు ఉపనిషత్తుగా మా రిం ది!మూల ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి స్మృతా "ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్మహామాయా" భవేత్"సీతాదేవి అయోనిజ, అ సామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చె ప్పా లంటే సీతమ్మ ప్రకృతి స్వ రూరిణిలక్ష్మీ అష్టోత్తర శత నా మాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమసీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపంరామయ్య పురుషస్వరూపం సీతమ్మ ప్రకృతిస్వరూపం ప్రకృతిపురుషులకు ప్రతిరూపాలుసీతారాములు! అంతే కాదు ప్రణ వనా దమైన ఓంకారంలో ఉంది కూ డా ఆ తల్లేసీత సత్వ రజ త మో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకారాలసంగమంసకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇ చ్ఛా శక్తికి సంకేతం! తకారం తా రా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పర మా త్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మ హాశక్తి అని బ్రహ్మగారు వివ రిం bచారు!! ఆ కీట బ్రహ్మ ప ర్యం తం సమస్త సృష్ఠికీ, సమస్త జ గత్తుకూ తల్లి సీతమ్మతల్లి!సీ తమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్ద బ్ర హ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూ పిణిగా వేదాధ్యయనం చేసే చో ట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండిఅత్యున్నతమైనఅలౌకికమైన భావాలను కలుగజేస్తుంది

రెండోరూపం జనకుడు భూ మి ని  దున్నుతున్నప్పుడు బయట పడిన రూపం! జనకుని కోట్ల జ న్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగాలభించిన క్రియాశక్తి రూపం సీతమ్మమూడోరూపం  అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగ త్తంతటిలో నిండి ఉండే జగదా నంద కారిణిగా లక్ష్మీ స్వరూ పంగా విరాజిల్లే తల్లి!ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తు ల రూపంగా,ముగ్గురమ్మలమూ లపుటమ్మగా   సాధకులు,ఉపా సకులు దర్శించవచ్చని బ్రహ్మ దేవుడు దేవతలకుబోధించాడురామభక్తులనుహనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప, హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి అందుకే భక్తరామదాసస్వామి భక్తితో పాడారు నను బ్రోవు మని చెప్పవే సీతమ్మ తల్లి!! నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరో మ ణి! జనకుని కూతుర జననీ జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!అని స్తుతిస్తాడు. 

0/Post a Comment/Comments