ఉగాది జాతీయ పురస్కారం-2023

ఉగాది జాతీయ పురస్కారం-2023

19.3.2023

ఉగాది జాతీయ పురస్కారం-2023

     నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన తెలుగు భాషోపాధ్యాయురాలు, రచయిత్రి మరియు కవయిత్రి డాక్టర్ పోల సాయిజ్యోతికి కర్ణాటక తెలుగు రచయిత సమైఖ్య వారు" ఉగాది జాతీయ పురస్కారం -2023"కళ్యాణ్ నగర్ బెంగళూరులో CBI EX జాయింట్ డైరెక్టర్ శ్రీ .వి.వి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు ప్రధానం చేయడం జరిగింది. సాహిత్యంలో  కృషిచేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మందికి ఉగాది జాతీయ పురస్కారము 2023ను ప్రధానం చేయడం జరిగింది. డాక్టర్ పోల సాయిజ్యోతి గారు రచించిన "చైతన్య జ్యోతి "కవితా సంపుటి ఈ ఉగాది జాతీయ పురస్కారం-2023 కు ఎంపిక కావడం జరిగిందని నాగర్ కర్నూల్ జిల్లా నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సభ్యురాలు సాయిజ్యోతి తెలిపారు.

   ఈ కార్యక్రమంలోCBI EX జాయింట్ డైరెక్టర్ శ్రీ. వి.వి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు, డాక్టర్ మాల్యాద్రి బొగ్గవరపు గారు, ఆశాజ్యోతి గారు, ఏకాంబరం నాయుడు గారు, దేవేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు, చండీశ్వర్ గారు, కాచం సత్యనారాయణ గుప్తా గారు, మమత గారు, సుబ్బారావు గార్లచే ఈరోజు బెంగళూరులోని ఇండోనేషియన్ అకాడమీ, కళ్యాణ్ నగర్ లో సాయి జ్యోతిని "ఉగాది జాతీయ పురస్కారం -2023 "తో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక తెలుగు రచయితల సమైఖ్య, ఇండోనేషియన్ అకాడమీ విద్యా సంస్థలు, డి.ఆర్ .అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి జ్యోతిని పలువురు అభినందించారు.

0/Post a Comment/Comments