"మహా జ్ఞాని అంబేద్కర్"
---------------------------------------
దళిత ధవళ కాంతితో
ఉదయించిన భాస్కరుడు
అంతులేని జ్ఞానంతో
పేరొందిన 'అంబేద్కరుడు'
అలుపెరగని కెరటంలా
పోరాడిన మగధీరుడు
అందరినీ మేల్కొలిపిన
అసమాన వైతాళికుడు
ఛీత్కారాలొందిన చోట
సత్కారాలొందిన ఘనుడు
ఘన భారతావని నోట
కొనియాడబడిన ధన్యుడు
కడు మేధో సంపన్నుడు
'దాదా' అపర చాణక్యుడు
అఖిల జగతి గౌరవించే
'మహా జ్ఞాని అంబేద్కరుడు'
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.
---------------------------------------
దళిత ధవళ కాంతితో
ఉదయించిన భాస్కరుడు
అంతులేని జ్ఞానంతో
పేరొందిన 'అంబేద్కరుడు'
అలుపెరగని కెరటంలా
పోరాడిన మగధీరుడు
అందరినీ మేల్కొలిపిన
అసమాన వైతాళికుడు
ఛీత్కారాలొందిన చోట
సత్కారాలొందిన ఘనుడు
ఘన భారతావని నోట
కొనియాడబడిన ధన్యుడు
కడు మేధో సంపన్నుడు
'దాదా' అపర చాణక్యుడు
అఖిల జగతి గౌరవించే
'మహా జ్ఞాని అంబేద్కరుడు'
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.