రంజాన్ పండుగ విశిష్టత ముత్యాల హారం ప్రక్రియలో..రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్

రంజాన్ పండుగ విశిష్టత ముత్యాల హారం ప్రక్రియలో..రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్


"రంజాన్ పండుగ విశిష్టత"

1)
రంజాన్ పర్వదినం
దివ్వ ఖురాన్ పఠనం
సంస్కృతికి చిహ్నం
ప్రేమ తో ఆలింగనం

2)
రంజాన్ నెల విశిష్టత
దేవుడి పైన విధేయత
ఉపవాసం  ప్రాధాన్యత
సమాజానికే సభ్యత

3)
నెల ఉపవాస దీక్షలు
ప్రవిత్ర మైన రోజులు 
ఆనందం చిరునవ్వుల
సంతోషంతో పిల్లలు

4)
రంజాన్ శుభాకాంక్షలు
సోదర సోదరిమణులు
ప్రేమ, శాంతి గుణాలు
జీవితంలో వెలుగులు

5)
ఇస్లాం మత స్థాపకులు
ప్రవక్త  ప్రవచనాలు
భక్తి శ్రద్ధల నమాజులు
ఘనంగా ఇద్ వేడుకలు

6)
ఈద్గా లోని భక్తులు
బారులు తీరిన జనాలు
కొత్త కొత్త బట్టలు
పుసె పరిమళ ద్రవ్యాలు

7)
రంజాన్ నెల భోజనాలు
రుచికరమైన వంటలు
నిరుపేదలకు దానాలు
లేని ధనిక బేధాలు

8)
సుర్మాతో అందాలు
అత్తరు సువాసనలు
కడిగే కాళ్ళు చేతులు
ఈద్గా లోనె పండుగలు

9)
దైవభక్తి ఉండాలి
రోజు నమాజ్ చేయాలి
అల్లా కరుణ పొందాలి
నెలవంకను చూడాలి

10)
పవిత్రమైన పండుగా
నిష్ట నియమాలు ఉండగ
ఉపవాసం కఠినంగా
సహర్ ఇప్తిర్ విందుగా

( ముత్యాలహారం రూపకర్త, కవి,రచయిత ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా)

రాథోడ్ శ్రావణ్ 
ముత్యాల హారం రూపకర్త
9491467715

0/Post a Comment/Comments