చిన్నారులు- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

చిన్నారులు- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

చిన్నారులు
---------------------------------------
పిల్లల మనసే వెన్నెల జల్లులు
మల్లెల మాదిరి తెల్లని వన్నెలు
పల్లెల రీతిని పంచును సొగసులు
ఎల్లరి మదిలో నింపును వెలుగులు

అల్లరి చేయుట చాలా ఇష్టం
బుద్ధులు చూడగ ఎంతో శ్రేష్ఠం
హద్దులు దాటని ముద్దుల బాలలు
మింటిని వెలిగే చక్కని తారలు

అమ్మానాన్నల ఆశల దీపం
భువిలో వెలసిన దేవుని రూపం
పిల్లలు ఉంటే కళకళ గృహములు
శోభను గూర్చును కిలకిల నగవులు

బాలల వెంటే నడుచును శుభములు
పూల జల్లులై కురియును సౌరులు
జగతిని వారే ప్రగతికి బాటలు 
మమతల కోటలు సమతల తోటలు

-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments