రవ్వా శ్రీహరి ఇక లేరు
సంతాపం తెలిపిన -డా.చిటికెన
--------------------
ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి పరమపదించడం పట్ల డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సంతాపం తెలిపారు.
సుప్రసిద్ధ సాహితీవేత్త, సంస్కృతాంధ్ర పరిశోధకులు, శ్రీహరి నిఘంటువు రూపకర్త, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, ఆచార్య రవ్వా శ్రీహరి మరణం సాహితీ లోకానికి తీరనిలోటు అని ఇంటర్నేషనల్ బెనెఓలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.