"పాలు తేనెలు" పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న

"పాలు తేనెలు" పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న

"పాలు తేనెలు" పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 33వ, కొత్త పుస్తకం 'పాలు తేనెలు' బాలగేయాల సంకలనం పిల్లల వైద్యులు డా.బాలయ్య  ,సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ జి. సురేంద్రనాథ్ ,ఫాదర్ చిన్నప్ప ,శ్రీ బంగారు సురేష్ ,శ్రీ అల్ఫ్రెడ్ రాజు మరియు ప్రముఖ కవి శ్రీ సవ్వప్ప గారి ఈరన్న గారుల చేతుల మీద,సూర్య తేజ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  , ఎమ్మిగనూరులో, శ్రీ ప్రసన్నరాజు అధ్యక్షతన ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం డా.బాలయ్య గారికి పాలుతేనెలు పుస్తకం రచయిత  సోమన్న అంకితమిచ్చారు. పిదప అనతి కాలంలో 33పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకుగానూ గద్వాల సోమన్న సాహితీ సేవలు ముఖ్య అతిథులైన వక్తలు గొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిన్న నారాయణ గారు ,శ్రీ గద్వాల ఆనంద్, శ్రీ నల్లమల ప్రకాష్ రాజు HEEO, డా.సౌదాకర్ రాజు,కృపరాజు,తోటి ఉపాధ్యాయులు , ఎ. నాగేశ్వరరావు గారు మరియు పుర ప్రముఖులు మరియు  శ్రేయోభిలాషులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments