శీర్షిక: ఉపన్యాసం ప్రతిభ
భారతరత్న బాబాసాహెబ్ డా: బి.ఆర్. అంబేద్కర్ గారి 132 వ, జయంతి సంధర్భంగా "అంబేద్కర్ జీవితం నుండి విద్యార్థులు గ్రహించవలసిన అంశాలు" అనే అంశంపై పద్నాలుగు మండలాలనుండి జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఉపన్యాసపోటీలు వనపర్తి జిల్లాలోని బాలభవన్ లో 13.4.23న నిర్వహించడం జరిగింది. అందులో అమడబాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తొమ్మిదవతరగతి విద్యార్థి
సి. పవన్ మొదటి స్థానంలో నిలిచి, ప్రతిభ కనబరిచాడు ఈరోజు జిల్లా కేంద్రంలో జరిగిన జయంతి ఉత్సవాలలో వనపర్తి జిల్లా జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్రీ ఆర్. లోకనాథ్ రెడ్డి గారు , మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ గారి చేతులమీదుగా ప్రథమబహుమతి అందుకున్నాడు.
పాఠశాల ప్రధానోపాద్యాయురాలు శ్రీమతి ఎన్. విద్యావతమ్మ గారు విద్యార్థి సి. పవన్ ను మరియు ప్రోతహించిన తెలుగు ఉపాధ్యాయులు సి. శేఖర్ గారిని అభినందించారు.పాఠశాల ఉపాధ్యాయులందరు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు గ్రామపెద్దలందరూ అభినందనలు తెలియజేశారు.