"ఉదారి సాహితీ ఉద్యమాల ఝరి"
----------------------------------------------------
ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ
తెలుగు కవులలో ఒకరైన డా.ఉదారి నారాయణ, ఉమ్మడి జిల్లా నుండి తెలుగు సాహిత్యంలో పిహెచ్ డి చేసిన తొలి కవి, రచయిత, పరిశోధకుడు.
తెలుగు భాషోపాధ్యాయులైన డా.ఉదారి నారాయణ
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని బండల నాగాపూర్ అనే గ్రామంలో 03 మార్చి 1964న జన్మించారు.
శ్రీమతి, శ్రీ
ఉదారి నాగదాసు, భూదేవి గార్లు ఆయన తల్లిదండ్రులు.
ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య డిగ్రీ వరకు ఆదిలాబాద్ జిల్లాలోనే చదివి,1989లో
ఉస్మానియా
విశ్వవిద్యాలయంలో
ఎమ్.ఏ (తెలుగు) పూర్తిచేశారు. 1990లో తెలుగు పండితులుగా శిక్షణ పొంది
గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు భాషా పండితులుగా ఉద్యోగంలో చేరి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నోత పాఠశాల సైదపూర్ మండలం బేల యందు విధులు నిర్వహిస్తు తెరవే జిల్లా గౌరవ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు.
కె.శివారెడ్డి గారి "ఆసుపత్రి గీతం-వస్తువు, సంవిధానం" అను అంశం పై ఎమ్.ఫిల్ పూర్తి చేసి,2001 లో "ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పృహ" అంశం పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి డాక్టరేట్ పట్టాను పొందారు.
మాతృ భాషా తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో కృషి చేస్తూ, పట్టుదలతో ఆరు సంకలనాలను వెలువరించారు.తన తొలి పుస్తకం ఆకుపచ్చని ఎడారిని 2001 లో ఆవిష్కరించారు.2011 లో "యాల్లైంది".2012లో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం "ఎల్గడి" కి ప్రధాన సంపాదకత్వం వహించారు. 2017 లో "మాగిపోద్దు" కవిత సంపుటిని తన గురువు గారైన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ఎన్.గోపి గారి చేతుల మీదుగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించడం సంతోషం.
2018లో ఆకాశవాణి ఆదిలాబాద్ లో ప్రసారమైన లోగిలి కార్యక్రమంలోని కొన్నింటిని అరుగు మీద ముచ్చట్లు పేరుతో లఘునాటికలను సంపుటంగా వెలువరించి 2019 లో ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర అను పుస్తకము రాసి జిల్లాకు వన్నె తెచ్చారు.
తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి, రచయిత, ఆచార్యులు ఎన్.గోపి ప్రవేశ పెట్టిన వచన ప్రక్రియ నానీలు తీసుకుని ఆదిలాబాద్ నానీలు-2020 పేరుతో సంకలనం వెలువరించడంతో పుస్తకాల సంఖ్య ఆరుకు చేరడం విశేషం.
ఆదిలాబాద్ తత్త్వకవులలో ఒకరైన తన తండ్రి గారైన ఉదారి నాగదాసు పేరిట స్మారక సంస్థను స్థాపించి కవులు, రచయితలను ప్రోత్సహిస్తూ కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించి వారిని
ఘనంగా సత్కరించడం గొప్ప విషయం. సాహితీ రంగంలో
కృషి చేస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులైన గౌ,, శ్రీ జూలూరి గౌరిశంకర్ చేతుల మీదుగా అలి శెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ఇటీవలే అందుకున్నారు.
తెలంగాణ రచయితల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులుగా సేవలందిస్తున్న కవి,
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం అభినందనీయం.
కొన్ని నానీలు పరిశీలిద్ధాం:-
-------------------------------
1)
దేశం వెన్నెముక
విలవిల్లాడుతోంది
గోడు చెప్పుకున
రోడ్డున పడ్డది.
దేశానికి వెన్నెముక అయిన రైతులు పలు సమస్యలతో సతమతమవుతు దుర్భర పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు.
వారి బాధలు వర్ణనాతీతం వాళ్ళ గొడు ఏవరికి చేప్పలేక చేప్పిన్న ఎవరు పట్టించుకోక బాధలు మింగలేక,కక్కలేక ఆత్మహత్యకు పాల్పడ్డుతున్నారు అని నానీలో వర్ణించారు.
2)
పుట్టలో
పాలు పోస్తేనే కాదు
పేదల పొట్టకు
నీళ్లిచ్చినా భక్తే
ఈ నానీలో పుటలో పాలు పోయడమే కాదు పేదలకు అన్నం, నీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆకలి బాధను తీర్చినప్పుడే మాధవుని సేవ కంటే మానవుని సేవ గొప్పదని కవి వివరించారు.
3)
ప్రశ్నల గొంతు ఒత్తే
ప్రజల హక్కులు కుక్కే
నేతలే
నేటి శాంతి దూతలు
రాజకీయ నాయకులు సామాన్య ప్రజలను గాలం వేసి జూటా మాటాలతో ప్రశ్నల వర్షాలు
కురిపించి లేని పోనీ హామీ ఇచ్చి వారి హక్కులను కాలరాస్తూ నేటి తరం శాంతి దూతల అవతారం ఎత్తారని కవి ఎగతాళి చేసి వ్వంగంగ చమత్కరించారు.
4)
కొండను పిండినా
నిండదు కడుపు
దేవుని బండతో
బంగారు బతుకు
ఈ రోజుల్లో మనసులు కష్ట పడటం కంటే సుఖానికి ఎక్కువ అలవాటు పడ్డారు. కష్ట పడి పని చేయడం చేతకాక దేవుని పేరు చెప్పి డబ్బులు సంపాదించి హాయిగా జీవనం గడుపుతున్నారని కవి సోమరిపోతులకు చురకలు అంటించారు.
5)
పెండ్లికి ముందు
పెదవులు ఎర్రగా
పెండ్లయినంక
కండ్ల ఎర్రగా
ప్రేమించి పెళ్లి చేసుకుని మోజు తీరాక ప్లేటు ఫిరాయిస్తు కాలం గడిపే యువకులు గుర్చి కవి పెళ్ళి కంటే ముందు పొగడడం తర్వాత వేధించడం భిన్న మనస్తత్వాలను వివరించారు.
తెలుగు సాహిత్యానికి విశేషంగా సేవలందిస్తున్న డా. ఉదారి నారాయణ ఈయన
మాతృభాష తెలుగే అయినందుకు సాహిత్యం తన తండ్రి ఇచ్చిన ఒక గొప్ప సంపద అని అంటారు.
ఈ "ఆదిలాబాద్ నానీలు" పుస్తకానికి ముఖ చిత్రంగా తెల్ల బంగారంగా ప్రసిద్ధ చెందిన ఆదిలాబాద్ జిల్లా నల్లరేగడి భూముల్లో రైతులు అత్యధికంగా
పండించే పంటలలో ముఖ్యమైన పంట అయిన పత్తి మొక్కను పెట్టి జిల్లా కీర్తిని చాటారు.ఈ పుస్తకంలో
మొత్తం 64 పుటాలతో చక్కని చిత్రాలతో ఆకర్షణీయంగా చుపరులకు, పుస్తక పఠన అభిమానులకు ఆశక్తికలగించే విధంగా కవి ఆశక్తితో చక్కని పదజాలంతో రుపొందించడం ప్రశంసనీయం.
ప్రతులకు:-
డా. ఉదారి నారాయణ
ఇంటి నెంబర్ 4-112/7/2
భగవతి నగర్, రోడ్ నెం:03
ఆదిలాబాద్,9441413666.
పేజీలు:-64
వెల:-70/-
"సమీక్షకులు"
రాథోడ్ శ్రావణ్
రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా.9491467715