అంబేద్కర్ ఆశయం ...సి. శేఖర్(సియస్సార్)

అంబేద్కర్ ఆశయం ...సి. శేఖర్(సియస్సార్)

అంబేద్కర్ ఆశయం

ఆయనో అవమాన సముద్రం 
ఆయనో అసమానతనెత్తుకున్న శిఖరం 
ఛాందస మనువాద సిద్ధాంతాన్ని 
అంతంచేయడమే ఆయన కంకణం
మనుషిలోని మనీషిని మేల్కొల్పడమే లక్ష్యం

అసమానతల అడ్డుగోడల్ని కూల్చేయడమే సంకల్పం 
ఆర్థికాసమానతల్ని రూపుమాపడమే నైజం 

అణగారిన వర్గాలకు దిక్సూచి 
అందరికి ఆయనే మార్గదర్శి

ప్రపంచమంతా నిద్రిస్తున్న
అట్టడుగువర్గాలనుద్దరించేందుకు 
నిద్రకు నిద్రపుచ్చి 
సమాదానంకోసం అహర్నిశలు వెదికిన వెలుగుకిరణమతడు

తనకెదురైన అవమానాలేవి తరువాతితరాలేవి 
ఎదుర్కోవద్దనే కృతనిశ్చయుడై భావిభారతనిర్మాణానికి పునాదులేసిన నిజమైన భారతీయుడు అంబేద్కర్ 

ఉన్నతులమంటూ బలహీనులను దోచుకునే 
సాంప్రదాయ వ్యవస్థను 
సిగ్గుపడేలా 
సాటిమనిషిని గౌరవించని 
సంస్కృతికి సమాదికట్టిన సంస్కర్త మన అంబేద్కర్

అణగారిన వర్గాల ప్రజలందరికి 
సమన్యాయమందించాడు 
బానిసబతుకులకు భయన్నితొలగించి 
రాజ్యాన్నేలే ఆయుధాన్ని 
ఓటుహక్కునిచ్చాడు 

కాని
ఆయన నమ్ముకోమన్న ఓటు 
నేడు సంతలో సరుకయ్యింది 
అమ్ముకుని బానిసలౌతన్న వైనం 

ఆయనదొక మహాసంకల్పం 
ఆ ఆశయమెప్పుడో ఓనాడు నిజమవ్వాలని 
ఆయన కలలు నెరవేరాలి

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments