కనక రాజు పద్మశ్రీ గారికి కవితలతో శుభాకాంక్షలు ..రచయిత రాథోడ్ శ్రావణ్

కనక రాజు పద్మశ్రీ గారికి కవితలతో శుభాకాంక్షలు ..రచయిత రాథోడ్ శ్రావణ్

కనక రాజు"పద్మశ్రీ" గారికి కవితలతో శుభాకాంక్షలు రచయిత  రాథోడ్ శ్రావణ్
~~~~~~~~~~~~~~~~

జైనూర్ మండలంలో
మార్లవాయి ఊరు
ఆదివాసులో పుట్టిన
కనక రాజు గారు
వారెవ్వా కనక రాజు
గుస్సాడీలకే రారాజు

మార్లవాయి  గూడేల్లో
విశిష్టమైన కళ
రేరేల దండారిలో
పద్మ వరించినవేళ
వారెవ్వా తొలి పద్మశ్రీ
నృత్య కళకే రాజు శ్రీ

యేత్మాసూర్  దైవభక్తి
నృత్య ప్రదర్శన శక్తి
కనక రాజు గారి కీర్తి
నవతరాలకు స్ఫూర్తి
వారెవ్వా కనక రాజుజీ
రాజగోండులకు రాజాజీ

ఆదివాసీ సంస్కృతి
గుస్సాడీ నృత్యంలో
గణతంత్ర వేడుక 
ఢీల్లీ ఎర్రకోట లో
వారెవ్వా రాజు పద్మశ్రీ
మన తెలంగాణాకు కీర్తి శ్రీ

పద్మశ్రీ పురస్కారం
రాజు వార్తాతో జనం
డెబ్భైరెండొ గణతంత్రం
రాష్ట్రపతిచే సన్మానం
వారెవ్వా  కనక రాజు
నృత్య ప్రదర్శనలో మహారాజు

ఆదివాసీ గూడలో
దేవతల పూజలు
డోళ్ళు,డప్పులతో
దండారి నృత్యాలు
వారెవ్వా ! గుస్పాడీలు
మీ కాళ్ళకు ఘల్లు ఘల్లు గజ్జెలు

దీపావళి ఉత్సవం
మదిలో ఆనందం
నేమలి ఈకల‌ కిరీటం
పాటాల్లో మకరందం
వారెవ్వా ! దండారి
ఎత్మాసూర్ పెన్ చూపేను దారి

గిరిజన కళా రూపాలు
దేవుడు ఇచ్చిన వరాలు
సంగీత వాయిద్యాలు
అడే ధింసా నృత్యాలు
వారెవ్వా ! గుస్సాడీ
అదే కనక రాజు గారడి

గుస్సాడీ నృత్యాన్ని
రాజు ప్రదర్శిస్తూ
దేశ వ్యాప్తంగా
రాజును అభినందిస్తూ
వారెవ్వా! మీ నృత్యఅద్భుతం
మీ గుర్తింపుతో గొప్పదనం
_________________________

తెలంగాణ రాష్ట్రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లావాయి గ్రామానికి చెందిన ప్రముఖ గుస్సాడీ కళాకారుడు గౌ‌, శ్రీ, కనక రాజు గారికి  72వ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం భారత అత్యోత్తమ  పౌర పురస్కారం మైన పద్మశ్రీ పురస్కారంచే  సత్కరించిన సందర్భంగా రాథోడ్ శ్రావణ్ గారు కనక రాజు గారిని కీర్తిస్తూ రాసిన కవితలు  
~~~~~~~~~~~~~~~~
రచనా.....✍️
రాథోడ్ శ్రావణ్ 
రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా 9491467715

0/Post a Comment/Comments