అధైర్యపడవద్దు

అధైర్యపడవద్దు

ఆత్మహత్యలు వద్దు జీవితా లే ముద్దు
వైద్య.శేషారావు లెక్చరర్ కామారెడ్డి
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెలుపడ్డాయి,రేపు పదవ తరగతి ఫలితాలు వెలుబడుతాయి కొందరికి ఆశాజనకంగాను మరికొందరికి నిరాశ జనకంగాను ఉంటుంది అయితే ఇంటర్ ఏజ్ లో మానసిక పరిపక్వత చాలా తక్కువగా ఉంటుంది ఒత్తిడి తట్టుకునే స్వభావం కూడా చాలా తక్కువ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోతే కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడతారు ఇది ఎంత మాత్రం సహహితకం కాదు చరిత్రలో చాలామంది మొదట్లో అపజయం పొంది విజయం సాధించిన వారు ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతా అయిపోయిందని భ్రమ అని భావించకూడదు జీవితం ఫలితాలు కన్నా ఎంతో ఉన్నతమైనది ఇంటర్ డిగ్రీ పీజీ చదివి ఉద్యోగాలు లేక చాలామంది వృధాగా ఉన్నారు ఇంటర్ ఎస్ఎస్సి ఫెయిల్ అయి కూడా ఆర్థికంగాను మంచి స్థాయిలో ఉన్నారు మరి ఇంటర్ జీవిత పరమార్ధం అనుకోవడం మూర్ఖత్వం ఇంటర్ అన్నది పై తరగతికి వెళ్లడానికి ఒక యోగ్యత లాంటిది మాత్రమే తల్లిదండ్రులు కూడా ఫలితాలు వచ్చిన వెంటనే ఇతరులను పోల్చి తిట్టడం గులగడం వంటివి చేయకుండా పోతే పోనీ మళ్లీ రాసుకుందువు ఈసారి కష్టపడి చదువు అనే ప్రోత్స హ న్ని ఇవ్వాలి వారిని ఒంటరిగా వదిలివేయకుండా మానసిక ఆందోళన గమనిస్తూ తరచుగా ధైర్యం ఇస్తూ ఉండాలి అపజయమే విజయానికి నాంది అనే అని వాళ్లను ఉత్తేజపరుస్తూ మరో అవకాశం ఉంది కనుక ఈసారి క్రమశిక్షణతో చదివి ఉత్తీర్ణులు కావచ్చు అని భరోసా కల్పించాలి అందుచేత పరీక్షలే జీవిత పరమావధి కాదనిన కాదు మనం విద్యలో ఒక భాగం మాత్రమే అని గుర్తు చేసి ముఖ్యంగా తొందరగా మానసిక ఉద్రేకానికి లోనై ఇబ్బందులు పడే వారిని గమనించి అవసరమైతే మానసిక వైద్యులను సంప్రదించి వారికి భరోసా ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఒకరి జీవితంతో ఇంకొకరి జీవితాన్ని పోల్చుకోవద్దు సమాజంలో సరాసరి ప్రజ్ఞావంతులే అధికం ప్రపంచంలో గణితమే దా విగా గుర్తించబడ్డ రామానుజన్ ఎస్ఎస్సి లో ఆంగ్లంలో ఫెయిల్ అయ్యారు క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇంటర్లో సరాసరి మార్పులతోనే ఉత్తీర్ణులయ్యారు అపజయానిగల కారణాలను విశ్లేషించుకుంటూ విజయానికి మార్గాలను ఏర్పరుచుకోవాలి కానీ బలవన్మరణం చెందడం వలన మనం మన కుటుంబాలకు దుఃఖాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం కార్పొరేట్ కాలేజీ పదేపదే ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కానీ నమ్మవద్దు మానసిక దౌర్బల్యాన్ని గుర్తించి దాన్ని తొలగించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే బోధించే గురువులు కూడా వారి అసహన వైఖరి ప్రదర్శించకూడదు సానుభూతితో ధైర్యాన్ని ఇవ్వాలి పిల్లల గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఇతరులను వేలెత్తి చూపే విధానాన్ని మానుకోవాలి ఆత్మవిశ్వాసం కన్నా గొప్ప ఆయుధం మరొకటి లేదు మన సమీపంలో ఉన్న గుర్తింపు పొందిన ఎందరో మేధావులు ఏదో ఒక స్టేజిలో అపజయాన్ని ఎదుర్కొని ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు బతకడానికి చదివే కొలమానం కాదు విద్య వివేకాన్ని మాత్రమే ఇవ్వాలి కానీ మార్కుల యంత్రంలో మరణాలు సంభవించవద్దు అధైర్యం వదలండి ధైర్యంగా నిలవండి మరొక్క మారు ఫెయిల్యూర్ ఇస్ మైల్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నది వాస్తవం అన్నది మరువ వద్దు.నేడు ప్రపంచ రసాయన శాస్త్ర వేత్తల్లో టోక్యో యూనివర్సిటీ విజిటింగ్ ప్రొపెసర్  ఫార్మా కంపనీ అధిపతిగా ఉన్న డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు పదవ తరగతి లో ఫెయిల్ అయిన వాడే,అక్కడే ఆగిపోతే ఈరోజు ఈ స్థాయి వచ్చేదా,కామరెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం లో పుట్టి ప్రభుత్వ సంస్థల్లోనే చదివి ఈ స్థాయి కి చేరుకున్నారు తన ఆత్మవిశ్వసము తో,అపజయం ఎదురైన చోటే విజయం కోసం పనిచేయాలి,అప్పుడు విజయం నీవద్దకు చేరి అపజయం నీ బానిస అవుతుంది
  ఉమాశేషారావు
  లెక్చరర్
  కామారెడ్డి
 9440408080

0/Post a Comment/Comments