"తుషార బిందువులు" పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

"తుషార బిందువులు" పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

"తుషార బిందువులు" పుస్తకావిష్కరణ
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 34వ, కొత్త పుస్తకం 'తుషార బిందువులు' బాలగేయాల సంకలనం జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డా.వెన్నపూస బ్రహ్మారెడ్డి, జాతీయ కార్యదర్శి జంపా కృష్ణ కిషోర్ గారుల  చేతుల మీద,ప్రకృతి వైద్యశాల, పట్టాభిపురం,గుంటూరులో,జన విజ్ఞాన వేదిక  మూడు రోజుల శిక్షణా తరగతులలో తొలి రోజు ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం కృష్ణకిషోర్ గారికి జ్ఞాపిక రచయిత  సోమన్న బహుకరించారు.. పిదప అనతి కాలంలో 34పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకుగానూ గద్వాల సోమన్న సాహితీ సేవలు ముఖ్య అతిథులైన వక్తలు గొనియాడారు. ఈ కార్యక్రమంలో డా.సోమ శంకర్ రెడ్డి,డా.కోటేశ్వరరావు ,క్తిష్ణయ్య,రమణారావు ,సాహితీమిత్రులు శ్రీనివాసరావు కోడెల గారుల,జె.వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు  మరియు  శ్రేయోభిలాషులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments