సోమన్న విరచిత"పాలుతేనెలు" పుస్తకావిష్కరణ మరియు సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన కొత్త పుస్తకం 'పాలుతేనెలు' బాలగేయాల సంకలనం అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ గారి చేతుల మీద టి.జి.వి.కళాక్షేత్రం,కర్నూలులో ఘనంగా ఆవిష్కరించారు.కవితాగానంఅనంతరం బాలసాహిత్యవేత్త సోమన్నను వారి సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ, రాష్ట్ర సభ్యులు మరియు కవులు పాల్గొన్నారు.