-డా.చిటికెన రచించిన లఘు చిత్రానికి వరించిన ఇంటర్నేషనల్ ఫీల్మ్ ఫెస్టివల్ అవార్డు
----------------------
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త , పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన " ఓ తండ్రి తీర్పు " లఘు చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం వరించింది.
ఇటీవలే ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ( ఐ ఎఫ్. ఎమ్. ఎ ). హైదరాబాద్, రెడ్ హిల్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ను ప్రముఖ కథా రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన *ఓ తండ్రి తీర్పు* లఘు చిత్రం నామినేట్ కాగా నిర్మాత,నటుడు చిట్టా రాజేశ్వరరావు కు ఉత్తమ సహాయ నటుడుగా అవార్డు అందించారు. కథా రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ.... ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయి నేటి కాలంలో ఎందరో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ కోల్పోతున్నారని, సమాజంలోని కొన్ని కుటుంబాల్లో జరిగే ప్రధాన సమస్యలు దృష్టిలో పెట్టుకొని మార్పు కోసం మానవీయ కోణంలో కథను అందించానని, అవార్డు అందుకోవడం సంతోషకరమని, శ్రీరామదూత ఫిల్మ్ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఇట్టి సందేశాత్మాక చిత్రానికి ప్రముఖ దర్శకులు, ఐదు నంది అవార్డుల గ్రహీత, ఎక్స్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గాధంశెట్టి ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారని, చిత్ర నిర్మాతకు ఈ సందర్బంగా చిటికెన అభినందనలు తెలియజేశారు.