బాలలు-భానులు
---------------------------------------
బాలలండి బాలలు
భగవంతుని రూపులు
పాల కడలి తరగలు
పాలవెల్లి సొగసులు
మల్లె వంటి మనసులు
తల్లి ఒడిని పిల్లలు
ఎల్లరికి ఇష్టులు
అల్లరికి వారసులు
ఇంటిలోన దివ్వెలు
తోటలోన పువ్వులు
మురిపించే మువ్వలు
విహరించే గువ్వలు
చిన్నారుల తలపులు
వెన్నెలంత స్వచ్చం
వెన్న ముద్ద వన్నెలు
కన్నవారి సొత్తులు
ముద్దు ముద్దు పలుకులు
సుద్దులన్ని తేనెలు
వృద్ధికిలను బాటలు
పెద్దలకు స్నేహితులు
జీవమున్న బొమ్మలు
ప్రగతి పట్టు కొమ్మలు
జగతిలోన పిల్లలు
కాంతులీను తారలు
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.
---------------------------------------
బాలలండి బాలలు
భగవంతుని రూపులు
పాల కడలి తరగలు
పాలవెల్లి సొగసులు
మల్లె వంటి మనసులు
తల్లి ఒడిని పిల్లలు
ఎల్లరికి ఇష్టులు
అల్లరికి వారసులు
ఇంటిలోన దివ్వెలు
తోటలోన పువ్వులు
మురిపించే మువ్వలు
విహరించే గువ్వలు
చిన్నారుల తలపులు
వెన్నెలంత స్వచ్చం
వెన్న ముద్ద వన్నెలు
కన్నవారి సొత్తులు
ముద్దు ముద్దు పలుకులు
సుద్దులన్ని తేనెలు
వృద్ధికిలను బాటలు
పెద్దలకు స్నేహితులు
జీవమున్న బొమ్మలు
ప్రగతి పట్టు కొమ్మలు
జగతిలోన పిల్లలు
కాంతులీను తారలు
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.