Pravahini

*చైతన్య భారతి సంపాదకత్వంలో మూడు సంకలనాల ఆవిష్కరణ* 
----------------------
*తెలంగాణ సారస్వత పరిషత్ వేదికపై ఘనంగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమం* 
--------------------

 ప్రముఖ కవయిపురి రచయిత్రి  పోతుల చైతన్య భారతి సంపాదకత్వంలో బడి పిల్లలు రచించిన పుస్తకాలు  ఇటీవల "తెలంగాణ సారస్వత పరిషత్తు" హైదరాబాదులో 
పద్మభూషణ్ డా. కె. ఐ వరప్రసాదరెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి కోడూరి శాంతమ్మగారి స్మృత్యర్థం ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించిన "బాలసాహిత్య సమ్మేళనంలో బాలకవులైన ZPHS నేరెళ్లపల్లి విద్యార్థులు రాసిన 
1)"నేరెళ్లపల్లి నేరేడు ఫలాలు"అనే కథాసంకలనం,
2). "నేరెళ్లపల్లి మణిరత్నాలు"అనే మణిపూసల సంకలనం,
3)"నేరెళ్లపల్లి మణిపూసలు"అనే మణిపూసల సంకలనా లను (ముడుపుస్తకాలు) ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి డా. జె. చెన్నయ్య గారు, ట్రస్ట్ సభ్యులు డా. పి. వసుంధర గారు, శ్రీమతి తురగా ఉషారమణి (తురగా ఫౌండేషన్)గారు, దక్కన్ లాండ్ పత్రిక సంపాదకులు శ్రీ మణికొండ వేదకుమార్ గారు, బాలసాహితీ వేత్త శ్రీ గరిపెల్లి అశోక్ కుమార్ గారు, రెండు రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన బాల సాహితీ వేత్తలు పాల్గొన్నారు. బాలకవులైన పిల్లలను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు, ఈ మూడు పుస్తకాల సంపాదకులు, కవయిత్రి పి. చైతన్య భారతి గారిని అతిథు లందరూ  అభినందించారు.💐🌹

0/Post a Comment/Comments