డాక్టర్ చిటికెనకు అభినందనలు
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను గడ్డం గంగాధర్ ఫౌండేషన్ సంస్థ ఈ రోజు సన్మానించింది.
పలు వార్తాపత్రికలలో సందేశాత్మక రచనలతో సాహిత్య పరంగా విశేష కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను హైదరాబాద్ నగర జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, బి. ఆర్. ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన సంస్థ కార్యాలయంలో అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.