శీర్షిక: పెళ్లిరోజు శుభాకాంక్షలు

శీర్షిక: పెళ్లిరోజు శుభాకాంక్షలు

శీర్షిక: పెళ్లిరోజు శుభాకాంక్షలు

భగవంతుడు జతపరిచిన బంధం 
మంగళకరమైన వచనాలతో
డోలుసన్నాయి మేళాలతో 
మూడుముళ్ళతో ఏడడుగులతో ఏకమైన పవిత్రబంధం దాంపత్యం 
ఇలలో ఇదెప్పటికి పరమపవిత్రం

కష్టసుఖాలను తట్టుకుని 
జయాపజయాలను నెట్టుకుని 
సంసారసాగరంలో  జీవనగమనాన్ని తీరం చేరేదాకా 
ఒకరిమనసునొకరు చదువుకుని 
ఇద్దరూ ప్రేమను పంచుకుని 
ఇద్దరూ ఒకటిగా 
బంధాన్ని 
అందంగా ఆనందంగా మలుచుకుని 
లోకమంత ఏకమైన 
ఎవరున్నలేకున్న 
తీరంచేరే బంధం 
ఆలుమగల అనుబంధం

(మిత్రుడు పుష్పశ్రీధర్ పెళ్లిరోజు సంధర్భంగా)

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

0/Post a Comment/Comments