అమ్మ

అమ్మ

నన్ను పొత్తిళ్ళల్లో దాచి
తండ్రిని చూడని నాకు
జన్మనిచ్చి చిరునామా గా
కూర్పు చేసి
అనైక్య కుటుంబం లో
అనేక కష్టాలు పడి
అన్నము పెట్టి
బతుకు కు ఆసరా అయ్యి
నేను చెట్టు అయ్యేందుకు
విత్తుగా
ఆ విత్తు కు పూడిమిగా
రాంబాయి
మనిషి ఉన్నప్పుడు విలువ
తెలువదు
అమ్మ తనం లోని కమ్మ తనపు
స్పర్శ
చెట్టు కు కాయ బరువా
ఒత్తిళ్లతో ఒంటరిగా
జీవనం సాగించి
జీవం పోసిన బ్రహ్మ
ఒక్కరోజు తో తీరదు అమ్మ నీ
రుణం
జ్ఞాపకాలను నెమరవేసుకుంటు
అశ్రువుల వెంట వచ్చే కన్నీళ్లలో
నీ ప్రతిబింబం చూస్తూ
అమ్మ నీకు వందనాలు
అశ్రునయనాంజాలీ
అక్షర అంజలి అమ్మ నీకు

0/Post a Comment/Comments