అదృష్టం బాలిక-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

అదృష్టం బాలిక-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

అదృష్టం బాలిక
---------------------------------------
చిరు నవ్వుల చిన్నారి
వెలుగు మోముల వన్నారి
పాల బుగ్గల పసిపాప
పసిడి కాంతుల చిరు దీప

తల్లిదండ్రుల స్వర్గం
వారి కలల రూపం
ముద్దులొలకు చిన్నారి
పలుకుల్లో మాధురి

అందమైన బాలిక
భగవంతుని కానుక
ఇంటిలోని దీపిక
మింటిలోని తారక

భలే భలే బాలిక
పరమౌషధ మూలిక
అదృష్టానికి ప్రతీక
ఎదగాలని కోరిక

-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments