నాన్న

నాన్న




నాన్న ఎందుకో వెనుక బడ్డాడు
       


అమ్మ తొమ్మిది నెలలు మోస్తే ;*
*నాన్న పాతికేళ్ళు...*
*రెండూ సమానమే అయినా - నాన్నెందుకో వెనకబడ్డాడు ;*

*ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ;*

*ఇద్దరి శ్రమ సమానమే అయినా ; అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు ;*

*ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ;*
*ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న ;*

*ఇద్దరి ప్రేమా సమానమే - అయినా..*
*అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకోబాగా వెనకబడ్డాడు*

*ఫోను లోనూ అమ్మ అనే పేరే ;  దెబ్బ తగిలినప్పుడూ - అమ్మా! - అనే పిలుపే ;*

*అవసరం వచ్చినప్పుడు తప్ప.. మిగతా అప్పుడు గుర్తు రానందుకు - నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా..?అంటే.. ఏమో..! *

*ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడం లో...*
*తరతరాలుగా - నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు..*

*అమ్మకి - మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు - బట్టలు..*

*నాన్న బట్టలకు దండెం కూడా నిండదు..!*

*తనని తాను పట్టించుకోవడం రాని నాన్న -*
*ఎందుకో మాక్కూడా పట్టనంత వెనకబడ్డాడు..*

*అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే..!*

*కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు..!*

*పిల్లల ఫీజులు - ఖర్చులున్నాయ్ అన్నప్పుడు..*
*ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ ; *
*ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే..*
*ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ;*

*ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా..                     మా అమ్మకంటే నాన్న చాలా వెనకబడ్డాడు..*

*వయసు మళ్ళాకా...                   అమ్మైతే ఇంట్లో పని కి పనికొస్తుంది..*

*నాన్న ఎందుకూ పనికిరాడని.         మేం తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా..*
*వెనకబడింది నాన్నే..!*
*నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం ;*
*ఆయన మా అందరికీ - వెన్నుముక కావడమే..!*

*వెన్నుముక వెనకుండ బట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం.. ఇదేనేమో నాన్న వెనుకబడి పోవడానికి కారణం…*
.          

0/Post a Comment/Comments