*ఆరుద్రలు* శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

*ఆరుద్రలు* శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

చూడ సుకుమారులే గాని
నేలనంత సారమయం చేయు..

తొలకరి వర్షానికి పిలవని చుట్టమై
పరిగెత్తుకుంటూ వచ్చే పర్యావరణ నేస్తాలు..

ముట్టుకుంటేనే ముడుచుకుపోయే
పట్టుకుంటే కందిపోయే
ప్రకృతి వరప్రసాదితాలు
ఒకదాని వెంట ఇంకొకటి ధారగట్టినట్టుగా..
గుంపులు గుంపులుగా చేరి
వరుసగట్టి పయనించు అలసట లేక..
అడుగులో అడుగు వేయు సమయాన
రైతు కంటపడినా
శుభసూచకమై మెరుయు
మోముపై సంతోషాన్ని నింపు..

కుంకుమను మించిన రంగు
చందమామను మించిన అందం
ఆయుర్వేద ఔషధంగా ప్రసిద్ధైనను
వాన రాకను తెలిపే
అరుదైన ఆరుద్రలు..

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments