సోమన్న విరచిత"వెన్నెల వాన" పుస్తకావిష్కరణ మరియు సన్మానం-ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత"వెన్నెల వాన" పుస్తకావిష్కరణ మరియు సన్మానం-ప్రవాహిని న్యూస్

సోమన్న విరచిత"వెన్నెల వాన" పుస్తకావిష్కరణ మరియు  సన్మానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన కొత్త పుస్తకం 'వెన్నెల వాన' బాలగేయాల సంకలనం అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్  డా.కత్తిమండ ప్రతాప్ మరియు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ జడ్జి శ్రీ నరహరి నారాయణ రెడ్డి గారల చేతుల మీద "ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్" ,మైసూర్ లో  ఘనంగా ఆవిష్కరించారు.కన్నడ-తెలుగు కవితా గోష్ఠిలో కవితాగానం అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేశవయ్య,నాగేశ్వరరావు శ్రీశ్రీ కళావేదిక జాతీయ, రాష్ట్ర  సభ్యులు  మరియు కవులు   పాల్గొన్నారు.సన్మాన గ్రహీత బాలబంధు గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments