పర్యావరణ దినోత్సవం

పర్యావరణ దినోత్సవం

నేడే ప్రపంచ పర్యవరణాదినోత్సవం దాని ప్రాధాన్యతను వివరించిన లెక్చరర్,కవి ఉమాశేషారావు వైద్య
భారతీయ ధర్మంలో పంచభూతాలుగా పిలుచుకునే గాలి నీరు నింగి నిప్పు నేల అనే పంచభూతాల వల్లే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది వీటిలో ఏ ఒక్కటి లోపించిన జీవనం అస్తవ్యస్తమవుతుంది భూమిపై అన్ని వనరులు సక్రమంగా ఉంటేనే మానవాభివృద్ధి నిజమవుతుంది కానీ అంతులేని ఆధిపత్య దాహం భూమండలాన్ని కాలుష్య కాసారంగా మార్చివేస్తుంది ఉపరితలంపై ఉన్న వరులే కాదు భూగర్భ జలాలు ఖదిర సంపదలను ప్రపంచ దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు భూతాపం పెరగడం వల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటు చేసుకొని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరోవైపు వాతావరణం లో మార్పుల కారణంగా జీవవైవిద్యం దెబ్బతింటుంది వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి సరైన వర్షాలు లేక కరువు కాటకాలు సంభవిస్తున్నాయి దీంతో జలవనులు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోలుకోలేని మార్పులను చేస్తున్నందున ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ నిర్మూలన ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకమైన పరిష్కారాలను ఈరోజు చర్చిస్తుంది ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్ 5న నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు చేపట్టి ప్రపంచ అవగాహనను పెంచేలా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవం నిర్వహించాలని పేర్కొంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు ఏటా ఒక  థీమ్ ఎంపిక చేసుకొని పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు 1974లో తొలిసారి ఒకే ఒక్క భూమి థీమ్ నిర్వహించగా 2019లో బీట్ ఎయిర్ పొల్యూషన్ పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు 2020లో టైం ఫర్ నేచర్ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు ఈ ఏడాది పునరాలోచన పునసృష్టి పునరుద్ధరణ పేరుతో నిర్వహిస్తున్నారు మానవాళి జీవనశైలిలో చిన్న మార్పులను తీసుకురావడానికి సంకల్పించాలి ఇది సహజ వనరులను పునరుద్దించడానికి సహాయపడుతుంది ప్లాస్టిక్ పై నిషేధం లేదా నగరాల్లో కాంక్రీట్ జంగిల్స్ లో పచ్చదనం నింపడం వంటి చర్యలను చేపట్టి సహాయపడే మార్గాలను పునసృష్టించుకొని పునరుద్దించుకోవాలన్నదే దీని ఉద్దేశము 2022 నాటికి ఈ పర్యావరణ దినోత్సవం కు 50 ఏళ్లు పూర్తయ్యాయి ఈ సంవత్సరం 51 వ సంవత్సరం జరుపుకుంటున్నాం గ్రీన్ లైఫ్ స్మైల్ అలవర్చుకోవడంతోపాటు పచ్చదనం పరిశుభ్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరింది స్వీడన్ దేశం నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్రం దట్టమైన అరణ్యాలు వన్యజీవులతో అలరాడుతుండేది తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పెద్ద ఎత్తున చెట్ల పంపకంపై అవగాహన పెంచడంతోపాటు ప్రజాప్రతినిధులను ప్రజలను భాగస్వాములు చేసి చెట్లను ప్రోత్సహిస్తుంది అందుచేత ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి కాదు బాధ్యతతో పెంచాలి లేనట్లయితే భూతాపం పెరిగి మానసిక రోగులుగా పర్యావరణ దుష్పరిణామాలతో రేపటికి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది దీనికి ఒకటే పరిష్కారం చెట్లు నాటాలి అడవులు పెంచాలి సహజ వనరులను సమాజం మొత్తం పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలి అప్పుడే మనకు మనుగడ లేదంటే ప్రమాదగంటికలు మూగక తప్పదు

0/Post a Comment/Comments