భూభాగం నిప్పుల కొలిమై
చుక్కనీరు కరువై
ప్రకృతి ప్రకోపానికి బలయై
సమతుల్యం లోపిస్తే
అతకూతలం జనం విల విల
భూ విస్ఫోటనం
విరుగుడు చెట్లే
జాతి ఔన్నత్యానికి
దేశ ప్రగతికి అడవులు
మూలం
ఆరోగ్య పరిరక్షణకు మూలం
ప్రకృతికి మానవునికి విడదీయరాని బంధం
విడిపోతే వినాశనం తధ్యం
స్త్రీ కి మాతృత్వం
పూడిమికి చెట్టు
చెట్లు నరకవద్దు
పర్యావరణానికి
తేవద్దు ముప్పు
ప్లాస్టిక్ ను నిర్మూలించి
సకల ప్రపంచాన్ని వీక్షించు
మనిషికి వస్త్రాలు
పూడిమికి చెట్లు
చెట్లు పెంచి చల్లని గాలితో
స్వరాలు పలుకుదాం
కోరి విధ్వంసం ఆహ్వానించి
సాధించే అభివృద్ధి దండగ
పర్యావరణ మూలాల్ని
వెతుకుతూ వేయి ముందడుగు
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి