*ప్రముఖ సాహితీవేత్త డా.చిటికెన ను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్*
----------------------
*ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( ఎస్. ఎ. టీ. ఎస్ ) చైర్మన్ సన్మానించారు.*
సాహిత్య పరంగా రచనలతో విశేష సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్య పరుస్తున్న తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు, ఓ తండ్రి తీర్పు - లఘుచిత్ర కథా రచయిత *-డా. చిటికెన కిరణ్ కుమార్* ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ *-డా.ఇ. ఆంజనేయ గౌడ్* హైదరాబాద్ లోని తన కార్యాలయం లో సన్మానించారు. చిటికెన సమకాలీన సామాజిక అంశాలపై తను రచించిన చైతన్య స్ఫూర్తి - చిటికెన వ్యాసాలు సంపుటిని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు *గడ్డం శ్రీనివాస్ యాదవ్* మాట్లాడుతూ కవులు రచయితలు చేసే సేవలు ఉత్తమమైనవని సమాజాన్ని ప్రగతి బాటలో నడిపించే దిశా నిర్దేశకులని చిటికెన ను అభినందిస్తూ తను రచించిన రచనలు సందేశాత్మకంగా ఉన్నాయన్నారు.