ఆయన విశ్వాన్ని చూసిన విశ్వంబరుడు!
వివరించిన,కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
ప్రముఖ గజల్ కవిగా సినీ రచయితగా నాటక రచయితగా గేయ రచయితగా అనేక ప్రక్రియలో రచనలు చేసి సాహిత్యంలో మెరిసిన తార ఆయన రచించిన పద్య కావ్యం విశ్వంభర గ్రంధానికి 1988వ సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది సినారే దీన్ని రాజ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు తన ప్రియతమైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు దీన్ని మొదటిసారిగా 1980లో ముద్రించారు ఈ కావ్యానికి నాయకుడు మానవు డు రంగస్థలం విశాల విశ్వంభరా ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని పేర్లతో అగాథ్యం లేని మనిషి కథ ఈ కథకు నేపథ్యం ప్రకృతి మనిషి ధరించే వివిధభూమికలకు మూల దాతువులు మనస్యశక్తులు మనిషి కథ ఈ కథకు నేపథ్యం ప్రకృతి అలగ్జాండర్ క్రీస్తు అశోకుడు సోక్రటీస్ బుద్ధుడు లెనిన్ లింకన్ మార్స్ గాంధీ ఇలా అన్ని రూపాలలో మనిషికి సంబంధించినవే కామము క్రోధము లోభము మదము ఆత్మ శోధనము ప్రకృతి శక్తుల వశీకరణము ఇలా ఎన్నెన్నో విభిన్న ప్రభుత్వంలో మనిషికి సంబంధించినవి. ఆదిమ దశ నుంచి ఆధునిక దశల వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యం లోని ప్రకరణలు మనిషి సాధన త్రిముఖము కళాత్మకం వైజ్ఞానికము ఆధ్యాత్మికము ఈ సాధనలో అడుగడుగునా ఎదురు దెబ్బలు క్షతుడైన మనిషి తిరుగుతూడు కాలేదు ఇలాంటి మహోన్నతమైన మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రమే విశ్వంభర కావ్యరచనకు పునాది నేను పుట్టుక ముందే నెత్తి మీద నీలి తెర కాళ్ళ కింద ధూళి పొర ఆ తెరకు అద్దిన అద్దాలలో పిల్లల్లో మినుగురులు కనురెప్పలు మీట కరించాయి చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు పాలమీగడల పరచుకున్నాయి దీనిలోని ముగింపు గమనిస్తే మనసుకు తొడుగు మనిషి ఒడిపో జగతి ఇది విశ్వాంబరతత్వం ఇది అనంత జీవిత సత్యం ఈ రచనకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించడంతోపాటు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనువాదించబడ్డాయి కలకత్తా భారతీయ భాష పరిషత్తు బిల్వార్ అవార్డును త్రివేండ్రం కుమార్ ఆసాన్ అవార్డును సోవేట్ ల్యాండ్ నైరు అవార్డును పొందింది విశ్వనాథ సత్యనారాయణ తర్వాత నాదంపేట అవార్డు పొందిన సినారే కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అమాజీపేట గ్రామంలో 1931 సంవత్సరంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా భాషా సంస్కృతిక సలహాదారుగా సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా రాజ్యసభ సభ్యులుగా సీనియర్ రచయితగా కవిగా ఆయన సాహితీ స్పష్టగా నిలిచి తెలుగు ఉర్దూ రచనల్లో రాణించి ఒక గొప్ప కవిగా నిలిచి సాహిత్య లోకంలో విరబూసిన పువ్వుగా కీర్తించబడుతూనే ఉంటాడు