డాక్టర్స్ డే

డాక్టర్స్ డే

దేశ సరిహద్దుల రక్షకులు
సైనికులు
దేహానికి రక్షకులు వైద్యులు
విచ్చిన్న కార శక్తుల తో పోరాటం వారిది
రోగనివారణ పోరాటం వీరిది
బయట వారు
అంతర్గతంగా వీరు
కార్పొ 'రేట్ ' కు అందలేక
ఆరోగ్యానికి ధీమా లేక
డీలా పడుతున్నది ఎందరో
ముస్లిం కు అల్లహ్
హిందువుల కు రాముడు
కృష్ణుడు
క్రైస్తవులకు క్రీస్తు
జైనులకు జీనుడు
బౌద్ధులకు బుద్ధుడు
అందరికి దేవుడు డాక్టర్
అందుకే వైద్యో నారాయనోహరి
అన్నారు
బ్రహ్మ ఆయువు పోస్తే
ఆయువును నిలిపే మరో
బ్రాహ్మలు వైద్యులు
వృత్తి నిబ్బద్దత గల డాక్టర్లకు
వందనం
ఆరోగ్యమిత్రులరా
మీ ఆరోగ్యం లెక్క చేయక
కరోనా మహమ్మారి 
కాలగర్భంలో సమాధి చేసిరి
ఎబోలా,మలేరియా,మాచూచి
అంతం చేసిరి
వారి నాడీ తో రోగాన్ని పాసిగట్టి
ప్రేమతో సేతస్కోప్ విశ్వాసానికి
స్కోప్ ఇచ్చిరి
మీరే దేవుళ్ళు...రోగుల పాలిట
ప్రత్యేక్ష దైవాలు
డాక్టర్ అశోక్ 
కుగ్రామలో పుట్టి
కామారెడ్డి ప్రజలకు
సేవాలందించి
మధుమేహం,థైరెడ్
 సమస్యలకే కాకుండా
 అంతర్జాతీయ, జాతీయ
 సెమినర్స్ లో పాల్గొని
వృత్తి నైపుణ్యత
లో రాణిస్తూ
మా కామారెడ్డి అనిముత్యమా
నీకు మా శుభాకాంక్షలు

0/Post a Comment/Comments