వ్యవసాయo అనే పదం లొనే
సాహయం ఉంది
అగ్రికల్చర్ అనే మాటల్లోనే
కల్చర్ ఉంది
విశ్వానికి కల్చర్ ని
సహాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక స్ఫూర్తి రైతు
ఆయన లేని ది విశ్వం మిథ్య
అఞ్ఞపరబ్రహ్మ స్వరూపం
తను ఎండిన
తనువు చాలించే వరకు
దుక్కిని నమ్మి
ఆశ కు నిలువెత్తు నిదర్శనం
చేయవద్దు మోసము
అన్నదాత ఉసురు ఊరికే
పోదు
రైతు వెన్నుముక
కాదు ఆయనే
సకల జీవరాశుల మనుగడ
రైతు బతుకును చేయవద్దు రౌతు
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి