జ్ఞాపకం

జ్ఞాపకం

గుండెల్లో గుడి
    దేవుడికి  గుడి లో నివాసం
    నిన్ను ఎరిగిన ప్రతివాడి
    గుండెల్లో నివాసం
    పేరులోనే ఉంది నర్సు
    అందుకే  అయింది బాయి
    అమ్మ ఊరందరికి పెద్దమ్మ
    అమృతమాయి
     అన్నపూర్ణ
     అడిగిన వారికి లేదనక
     ఆత్రుత తో ఉన్నది పెట్టె
     అమ్మ
     మంత్రాల అమ్మ
     కర్ణాల అమ్మ
    జిష్టి అయిన,పట్టు మంత్రం
    అయిన
    భవిత ను చెప్పిన రామ చిలుక
ఎన్నికోట్లు ఉన్నాయి 
కుచేలా సంతానం
అనుక్షేణం నందికంటి పరివారం కోసం తపించి
పరితపించి
సంఘర్షణ మనుసు లో
ఎన్నో తుపానులు
నీ చర్యలు కొందరికి ఖేదం
మరికొందరికి మేధం
ఆస్తులు ఇంటికి పెరు ఇచ్చావు
అమ్మ ఏమి ఇచ్చింది అని కాదు
అమ్మ మీకు జన్మనిచ్చింది
లేకుంటే మీ విమర్శలకు
వేదిక దొరికేదా
ఒక్కనాఁడు అయిన స్వార్ధం కోసం ఆలోచించారా
పుట్టింటి క్షేమం
మేట్టింటి క్షేమం
ఎన్నో నోములు వ్రతాలు
ఒక చెట్టుకు ఒకే తిరుకాయలు
కొన్ని కాయాయి కొన్ని కాస్థాయి
హెచ్చుతగ్గులు
మరి ఆ చెట్టు తప్ప
కాదు కాదు
తల్లికి ప్రేమ అనే బలహీనత
ఉంటుంది
అల్లికలు వచ్చు
ఆత్మీయతలో మల్లె తీగ
ఇక్కడే అనుభవించావు
అక్కడ స్వర్గ ప్రాప్తే
పద్మం తో శోభించి రమ్యం
తో ఉమా గా
బాల తో జేష్ఠపుత్రుడు గా
గంగ ,నర్సింగ,మూర్తి తో
కుటుంబాన్ని విస్తృత పరిచి
మనుమలు మనుమరాళ్లతో
జగమంత కుటుంబాన్ని
సృష్టించుకొని
అప్పుడే ఏడాది దాటిన
మా కనుబొమ్మల్లో
దాగి ఉన్న సాక్షవి
ఒక్క నిమిషం మనుసుతో
చూడు ఆమె కదలాడే
అమ్మ రూపం
నీకు వందనం
ఉమాశేషారావు వైద్య

0/Post a Comment/Comments