అధికమాసం అంటే ఏంటి? నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి?*
*అధికమాసం, నిజ శ్రావణ మాసం తేదీలు, ఆయా సమయాల్లో చేయాల్సిన కార్యాల గురించి తెలుసుకుందాం..*
*జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుని ఆధారంగా లెక్కగట్టే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారు.*
*చాంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులు. దీనిప్రకారం చాంద్రమానంలో ఒక సంవత్సరం అంటే 354 రోజులు. అనగా చాంద్రమాన పద్ధతిలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది. సౌరమానం చాంద్రమానంలో ఈ తేడా ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది. అది అధిక మాసంగా ఏర్పడును.*
*అందుచేత 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధిక మాసంగా, చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధిక మాసమని అంటారు..*
*ఇలా ఈ అధిక మాసము శూన్యమాసమైనందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము. అధికమాసంలో వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటివి నిషేధించారు. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు. పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించవలెను.*
*అధిక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు*
*18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం అవుతుంది.. ఇక నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంది.* *. అధిక మాసం శూన్య మాసం. భగవత్ సాక్షాత్కారాానికి సంబంధించిన కార్యక్రమాలు, పుణ్యార్చన సంపాదించే కార్యాల ఆచరించవచ్చు. అనగా హోమాలు, విష్ణుసహస్రనామ పారాయణం, అష్టాదశ పురాణాలు, మహాభారత పఠనం, రామాయణ పఠనం వంటివి చేయవచ్చు.*
*అధిక మాసంలో ఆచరించవలసినవి*
*దైవారాధనలు,* వ్రతాలు, *పితృ ఆరాధన*, *అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి..**పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమున్నది.* *మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక మాసము.* *మహావిష్ణువు అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడినది.*
*విష్ణుమూర్తి అధికమాస మహాత్యాన్ని చెబుతూ ఈ మాసంలో చేసేటటువంటి మంచి పనులకు అధికమైన ఫలితాలు వస్తాయని అందుకనే ఈ మాసానికి అధికమాసమని పేరు. అందువలన అధిక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్ర నామాలు పఠించడం ఏకాదశి రోజు ఉపవాసము వ్రతాలు దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసముల కన్న అధికమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.*
*అనాథలకు మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం, దానధర్మాలు ఆచరించడం వల్ల మామూలు మాసంలో చేసేటివంటి వాటి కంటే అధికమైన ఫలితం పురుషోత్తమమైన మాసం అయినటువంటి అధికమాసంలో లభిస్తుంది.*
*పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధికమాస మహిమ గురించి మహావిష్ణువును అడుగగా మహావిష్ణువు ఈ అధిక మాసమైనటువంటి పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు జప హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని చెప్పారు.*
*ఇదియే కాకుండా ఇలాంటి అధిక మాసంలో గనుక పుణ్యకర్మలు ఆచరించకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు. అధికమాసంలో శుక్ల పక్షమునందు గాని కృష్ణపక్షమునందు గాని అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున కనీసము ఈ పుణ్యకార్యాలు ఆచరించినట్లు అయితే వారికి అధిక మాస పుణ్య ఫలము లభిస్తుందని విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పురాణాలు తెలిపాయి.*
*నిజ శ్రావణ మాస తేదీలు : 17/ 08/ 2023 గురువారం నుంచి 15 /09 /2023 వరకు. శ్రావణ సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17/08/2023 నుంచి 15/09/2023 మధ్య కాలంలో జరుపుకోవాలి
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
.