అతను చూపే మార్గమంతా
నిత్యం వెలుగులు వెదజల్లుతుంది..
జ్ఞాన ప్రసారవాహకుడై
తరతరాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని
పూర్ణ వ్యక్తిత్వంతో
నడిచే నవశక్తిగా
చీకటి పొరలను చీల్చే అర్కుడతను..
కాలానికనుగుణంగా నిరంతరం జ్ఞాన వలయాన్ని
విస్తరింప చేస్తూ
నిత్యం జ్ఞాన దీపాలెన్నింటినో వెలిగిస్తూ..
సదా విద్యాకుసుమాలెన్నింటినో విరబూయిస్తూ..
అద్భుతాల నదిలో అవలీలగా
పయనింపజేయించే గురువతను..
గురుపూర్ణిమ సందర్భంగా
గురువులందరికీ శుభాకాంక్షలు..
💐💐💐💐💐💐💐💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*
Post a Comment