PravahiniSent from Yahoo 
జంతు ప్రేమికురాలు రాణీ ప్రసాద్ 
భూమండలంలో మానవులతో పాటు జంతువులు మొక్కల పాత్ర కూడా సమానంగా ఉంటుంది. ప్రకృతిలో జంతువులు లేకుండా మానవ మనుగడను ఊహించలేం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ మనతో ఎన్నో జంతువులు మమేకమై తిరుగుతూ ఉంటాయి. పొలంలో దున్నటానికి ఎద్దులు ల్పలు ఇవ్వడానికి గేదెలు, ఇల్లునూ, ఊరునూ కాపలా కాయడానికి కుక్కలు, వాహనంగా పనికొచ్చేందుకు గుర్రాలు- ఇలా ఎన్నో జంతువులు మానవులకు సహాయం చేస్తుంటాయి. మానవులతో చెలిమి కొనసాగిస్తున్నాయి. అంతటి ప్రాముఖ్యాన్ని వహించే జంతువులను మామూలుగా ఇంట్లో దోరికే వస్తువులతో తాయారు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ బాల సాహితివేత్త డా.. కందేపి రాణి ప్రసాద్ పిల్లలకు జంతువుల ప్రాముఖ్యాన్ని ప్రాశస్త్యాన్ని తెలియ జేయటానికే వీటిని తాయారు చేస్తున్నట్లుగా రాణి ప్రసాద్ చెప్పారు. ఆమె ఇంతకు ముందు వంద జంతువుల మీద పాటలు, కవితలు రచించి పుస్తకంగా తీసుకు వచ్చారు. అలాగే ఈనాడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న జంతువులనూ, విలుప్త మైన జంతువులనూ చార్టులుగా మరిచి తమ ఆసుపత్రి గోడలపై పిల్లల కోసం అతికించారు. కూరగాయలను కత్తిరించి అరవై జంతువుల్ని తాయారు చేసి ' బొటనికల్ జూ ' అనే పేరుతో పుస్తకం వెలువరించారు.
ఈసారి వినూత్నంగా వంటింటి సామాన్లు మరియు మొక్కల ఆకులతో జంతువులను తయారు చేశారు. ఆ తయారీ విధానాన్ని వ్యాసాల రూపంలో ప్రముఖ దిన పత్రికలో రెండు సంవత్సరాల పాటు రాశారు. సుమారు నూట యాభై జంతువుల చిత్రాలను తాయారు చేయడమే కాకుండా వాటి యొక్క ప్రధాన లక్షణాలను, ప్రత్యేకతలను కూడా తెలుపు తున్నారు. ఆమె చదివించి జంతు శాస్త్రంలో ఎమ్మేసి కాబట్టి తనకు జంతువులంటే అమిత ప్రేమ అంటారు.
వంటింట్లో ఉండే కంది పప్పు, పెసరపప్పు, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పాయలు వంటి అనేక రకాల పప్పు ధ్యాన్యలతో పాటు ఎన్నో రకాలతో జంతువుల్ని సృష్టించారు. పూరీలు చేసుకునే గోధుమ పిండితో సైతం కాకి, బల్లి, మొసలి వంటి జంతువుల్ని చేసి ఆశ్చర్య పరిచారు. ఎగిరే జంతువులైన పక్షులు, పాకే జంతువులైన తొండ, పాము లాంటి సరి సృపాలు, నీటిలో నివసించే చేపలు, తాబేళ్ళు, పీతలు, నత్తలు వంటి అనేక రకాలను మిరియాలు, అల్లం, జాజికాయ, బగారా ఆకూ వంతియా మసాలా దినుసులతో సైతం సృష్టించారు. మానవుడికి శక్తినిచ్చే క్పలను అందించే ఆవు మేకలను అవిశగింజలు ఆకులు, ముడి బియ్యం, కాయలు విత్తులు గడ్డి వంటి ఎండి పోయిన వారితో తాయారు చేసి వృధాకు అర్థం కల్పించారు. ఈ కాలంలో ప్రతి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ వాడకం బాగా పెరిగింది. ఖర్జూరాలు, అంజీర్లు, పిస్తా, బాదం, బ్లాక్ బెర్రీ, రెడ్ బెర్రీ, బ్లూ బెర్రీ వంటి పండ్లను తింటున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ తో చెంగున దూకే లేళ్ళనూ, పొడువు మెడ జీరాపిలనూ, వూలు నిచ్చే గోర్రేలనూ తాయారు చేసి ప్రదర్శనకు పెడుతున్నారు. వాటిని చూసిన పిల్లలు పెద్దలు సైతం అబ్బుర పడుతున్నారు. పిల్లలకు వంటింటి సరుకులతో పరిచయం కూడా జరుగుతుందని సంబరపడుతున్నారు.
హాస్పిటల్లో పారవేసే ప్లాస్టిక్ మూతలు వెంటిలేటర్ పైపులు సైతం ఉడుత, గుడ్లగూబ, కుందేలు, ఎలుక వంటి జీవులుగా మారి పోయాయి. మానవులతో నేస్తంగా కల తిరిగే రామచిలుక, సీతాకోక చిలుక, నెమలి, పావురం, పిచ్చుక, కాకి వంటి పక్షులు కూడా ఈ జంతు సమూహంలో కూర్చుని ఉన్నాయి. మృగరాజు సింహం, పులి అడవిలో పెద్ద జంతువు ఏనుగు వంటి మహామహులు కూడా రాణి ప్రసాద్ జంతు రాజ్యానికి విచ్చేసి ఉన్నాయి. మానవులకు రోగాలను అంట గట్టే ఈగ, దోమ సైతం వచ్చిన వాళ్ళను కుట్టటానికి రెడీగా ఉన్నాయి. రాణి ప్రసాద్ చేసిన ఈ జంతువుల్ని తిలకించాలనుకుంటే వారింటికి వెళ్ళి మిల్కీ మ్యూజియం లో చూడవచ్చు.
 on Android

0/Post a Comment/Comments