జయహో!భారత్!!-జయహో చంద్రయాన్-3--గద్వాల సోమన్న9966414580

జయహో!భారత్!!-జయహో చంద్రయాన్-3--గద్వాల సోమన్న9966414580

జయహో!భారత్!!
--------------------------------------
ఇస్రో నిర్మిత చంద్రయాన్-3
చంద్రునిపై కాలుమోపింది
భారత దేశపు గొప్ప కీర్తి
ప్రపంచమంతా చాటింది

ఇస్రో శాస్త్రవేత్తల కృషి
కార్యరూపమే దాల్చింది
అహర్నిశలూ చెమటోర్చిన
వారి స్వప్నం ఫలించింది

విశ్వం వినువీధుల్లో త్రివర్ణ 
పతాకం రెపరెపలాడింది
మన చంద్రయాన్-3  సాహసయాత్ర
సరికొత్త చరిత్ర సృష్టించింది

సమిష్టి కృషితో ఏదైనా
సాధ్యమనునదే రుజువైంది
ఘన శాస్త్రవేత్తల పనితనం
విశ్వమంతా వెల్లడైంది

-'బాలబంధు' గద్వాల సోమన్న,
9966414580. 

0/Post a Comment/Comments