ఉస్తవ్ వేదిక లో కల్పన దేవసాని గారి పాటల సందడి

ఉస్తవ్ వేదిక లో కల్పన దేవసాని గారి పాటల సందడి

ఉస్తవ్ వేదిక లో కల్పన దేవసాని గారి పాటల సందడి 

త్యాగరాయ గానసభ చిక్కడపల్లి హైదరాబాద్ లో శనివారం సాయంకాలం జరిగిన శాతవాహన ఈవెంట్ మేనేజ్మెంట్ ఉస్తవ్ కార్యక్రమంలో బాన్సువాడ కేంద్రానికి చెందిన గురుకుల ఉపాధ్యాయురాలు కల్పన దేవసాని భాగం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సునామీ సుధాకర్ , జీ సరిగమప విన్నర్, తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ గాయకుడు రేణు కుమార్, తెలుగు ఇండియన్ ఐడల్ 2023 రన్నరప్ వైష్ణవిల మరియు గాయకుడు గౌతమ్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకోవడం పై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అద్భుతమైన ఈ కార్యక్రమంలో తాను ఒక భాగస్వామి అయినందుకు ఈవెంట్ మేనేజర్ సుధీర్ కుమార్ గారికి కల్పన ధన్యవాదాలు తెలిపారు. తన ఉషారైన పాటలతో కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలను ఉర్రూతలూగించారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న కల్పనకు బంధువులు, ఉపాధ్యాయ బృందం మరియు మిత్ర బృందం హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు

0/Post a Comment/Comments