కుడి చేతికే రక్ష ఎందుకు కడుతారు

కుడి చేతికే రక్ష ఎందుకు కడుతారు

రక్ష అంటే రక్షణ బంధన్ అంటే సంబంధం అందుకే ఈ పండుగకు రక్షాబంధనం పేరు వచ్చింది సోదరి తన సోదరుని చేతికి పవిత్రమైన దారం కట్టేటప్పుడు దీర్ఘాయువు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది సోదరుల సురక్షితమైన సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని ఈ పండుగ ఉద్దేశం సోదరులు జీవితాంతం రక్షణగా ఉంటారని దీని ప్రమోద్దేశం అయితే కుడి చేతికే రాఖీ కట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి హిందూ మతంలో ఎడమచేతికి చెడు అనే అర్థం ఉంది అశుభంగా పరిగణిస్తారు అయితే ఇది మూఢనకం నమ్మకంగా కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి భారతీయులు ఎడమచేతిని శుభ్రపరచే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు హిందువులు చెప్పుకునే సవ్య అపసవ్య విశాల ప్రకారం సవ్య దిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది అపసవ్య దిశ నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు తమిళ సాహిత్యంలో కుడి చేతికి రాఖీ ఎందుకు ఎందుకు కట్టాలో ఒక కారణం ఉంది పులులు సాధారణంగా ఎడమవైపు కాకుండా కుడివైపున పడే వేటను మాత్రమే తింటాయి తమిళ సంస్కృతిలో కుడివైపు ఎడమ కంటే ఎక్కువ బరువు ఉంటుంది చాలా సంస్కృ తులో భాషల్లో కుడిని అదృష్టం గాను దురదృష్టం గాను భావిస్తారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడి చేతికి వందనం కట్టడం ద్వారా వాత పిత్త కాపం నియంత్రణలో ఉంటాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు సోదర రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీరంశాలు క్రమబద్ధీకరించబడి న ఆరోగ్యం మెరుగుపడుతుంది నాడీ శాస్త్రం ప్రకారం మానవ శరీరం లో  ఇ డా,,పింగళ, సుషూమన, ఈ మూడింటిలో పింగళి నాడి కుడివైపున ఉంటుంది ఇది పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది మగవారిలో పింగళి నాడు చైతన్యవంతం అయితే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది అందుకే సోదరులు కుడి చేతికి రాఖీ కట్టాలి అని చెప్తారు సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు జపించవలసిన మంత్రం
యేన బద్ధో బలి రాజా దానవేంధ్రో మహాబలః
తెనత్వామభి  బద్నమి రక్షే మా చల మాచల!
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments