కంబదహాళ్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు-'బాలబంధు' గద్వాల సోమన్న

కంబదహాళ్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు-'బాలబంధు' గద్వాల సోమన్న

కంబదహాళ్ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
--------------------------------------
పెద్దకడబూర్ మండల పరిధిలోని కంబదహాళ్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.బాలబంధు,గణితోపాధ్యాయులు గద్వాల సోమన్న మరియు తెలుగు భాషోపాధ్యాయులు కేశవయ్య గారల ఆధ్వర్యంలో ,విద్యార్థుల సమక్షంలో, ఉపాధ్యాయులంతా వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్ర పటానికి పూలమాల వేసి,శుభాకాంక్షలు తెలిపారు.గద్వాల సోమన్న, కేశవయ్య గారులు మాట్లాడుతూ వాడుక భాష తెలుగుకు గిడుగు వారు చేసిన సేవలు,కృషిని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంతలక్ష్మి,పద్మావతి, బాబు,నిర్మలరాణి,లక్ష్మీ,అనిత ,రంగన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments