మానవతా దినోత్సవం

మానవతా దినోత్సవం

మానవత సేవ చేస్తున్నప్పుడు మానవతా సిబ్బంది ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కు నివాళులర్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటారు 2023లో 14వ ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు 19న దీన్ని జరుపుకోవడానికి గల  కారణం ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం పై జరిగిన బాంబు దాడిలో అప్పటి ఇరాక్ సెక్రెటరీ జనరల్ యొక్క ప్రతినిధి సర్గియో వైరా డి మెల్లో మరియు అతని 21 మంది సహచరులు మరణించిన రోజు ఆగస్టు 19 2009 దీనికి సంఘీభావంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తింపు పొందిన తర్వాత 19 ఆగస్టు 2009లో ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకున్నారు ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం కష్టమైపోయింది మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది చాలామంది బిజీ లైఫ్ పేరిట మానవత్వం మనుగడ నే ప్రశ్నార్థకం చేస్తున్నారు కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు అందరికన్నా ముందుగా మన దేశ సైనికులు అసాధారణ సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సైనికులు  ఎండైరెఫ్ సిబ్బంది అత్యంత సాహసభ్యతంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు మొన్న ములుగు జిల్లా లో ఒక ఉపాధ్యాయుడు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి స్కూల్ పిల్లలను తన ఇంట్లో సురక్షిత ప్రాంతంలో ఉంచి చాలా ప్రమాదాన్ని తప్పించాడు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మానవతా దినోత్సవం జరుపుకోవడానికి కారణం సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలని ఆలోచనను ప్రజల్లో కలిగించడం మానవత్వానికి మించిన గొప్ప మరొకటి లేదని ప్రపంచ ప్రజల మధ్య నిరంతర సహకారాన్ని సాధించేందుకు ఈ ఉద్దేశం హ్యూమన్ మ్యూచువల్ కో ఆపరేషన్ అవగాహన నుంచి వచ్చేదే ప్రేమ ఇదే మనిషి ఆటవిక ప్రవృత్తిని నాశనం చేసి స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments