పత్రికా ప్రకటన
*కుసుమ ధర్మన్న యువ సాహిత్య ప్రతిభా పురస్కారానికి పి. సుష్మ ఎంపిక*
-------------------
కుసుమ ధర్మన్న యువ సాహిత్య పురస్కారానికి జాతీయస్థాయిలో వచ్చిన దరఖాస్తుల నుండి పి.సుష్మ, మక్తల్, నారాయణఖేడ్ జిల్లా, తెలంగాణ ను కమిటీ జూరీలు ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్, ఎమ్. టీ. స్వర్ణలత లు ఎంపిక చేశారు. ఇట్టి పురస్కారాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.రాధా కుసుమ( కుసుమ ధర్మన్న మనుమరాలు ) సెప్టెంబర్ 8వ తేది రోజున రవీంద్ర భారతి హైదరాబాద్ లో ప్రముఖుల సమక్షంలో నిర్వహించే కార్యక్రమం నందు ఎంపికైన అభ్యర్థికి గండపెండేరం,వస్త్ర కిరీటం, 5,116 రూపాయల నగదు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించనున్నట్లు డా.రాధా కుసుమ ఒక ప్రకటనలో తెలియజేశారు.