గణపతి

గణపతి

గోమయ గణపతి మరింత శ్రేష్టం.  కవి లెక్చరరు  ఉమాశేషారావు వైద్య.
కామారెడ్డి జిల్లా దోమకొండ  ప్రభుత్వ జూనియర్ కళాశాల కు చెందిన  కవి లెక్చరర్ ఉమశేషారావు  గోమయ  అవుపేడతో తయారు చేసిన గణపతి తో మనం పూజ చేస్తే అనారోగ్యం తొలిగి,సర్వ పీడనలు తొలిగి,విద్యార్థులకు అఖండ విద్యా సిద్ధిస్తుంది. ,సంతానం లేనివారికి  సంతానం  కలుగుతుంది  అని,గోమాత లో ముక్కోటి దేవతలు ఇమిడి ఉన్నారు.   చవితి రోజు అవుపేడతో తయారు చేసుకొని,మనసులో సంకల్పం చెప్పుకొని నమో వక్రతుండాయ అంటూ 108 ప ర్యాయములు కానీ 1008  జపం చేసుకొని, గంధపుష్పములు సమర్పిస్తే చాల పుణ్యప్రదం అని శాస్త్రం చెప్పుతుంది..ఇది చెట్టు కింద పెట్టిన కంపోస్టు ఎరువుగా మొక్క ఎదుగుదలకు, తోడ్పడితుంది.నీళ్లలో నిమజ్జనం చేసిన సులభంగా కరిగి నీటిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.ఈ గోమయ గణపతి  తయారు చేసుకొని  భాద్రపద చవితి రోజున గాని,ప్రతి చవితి,సంకష్ట చతుర్థి రోజు నిర్వహించుకోవచ్చు. అర్ధమండలం 21 రోజు ఏ రోజు కు ఆ రోజు తయారు చేసుకోవాలి.దీని వలన సమస్త కష్టములు తొలిగి సుఖ సంపదలు పొందగలరు. గోమయ  గణపతి తో మరింత శ్రేష్టం అని తాను దానినె వినాయక చవితి రోజు పూజిస్తున్నాను అని కవి,లెక్చరర్ ఉమాశేషారావు చెప్పారు.

0/Post a Comment/Comments