కవి వరశ్రీకి సన్మానం

కవి వరశ్రీకి సన్మానం

గురజాడ అప్పారావు గారి 161 వ జయంత్యుత్సవాలు "సేవ" సాహితీ సంస్థ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తేదీ : 21-09-2023 న ఘనంగా జరిగాయి. అందులో పాల్గొన్న కవి శ్రీ ఈ.వి.వి.యస్. వర ప్రసాద్ గారు "కవి శేఖరుడు గురజాడ" అనే కవితను వినిపించి, నిర్వాహక సభ్యలచే సన్మానం పొందారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యురాలు శ్రీమతి బోర భారతీదేవి గారు రాసిన *భారతమ్మ శతకం* పుస్తక ఆవిష్కరణ జరిగింది.
       ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ కంచర్ల సుబ్బరాయుడుతో పాటూ.. ముఖ్య అతిధులుగా వెలమల సిమ్మన్న గారు, నటుడు మిశ్రా గారు, ఆంధ్ర రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులు విజయబాబు , Dr. కూటి కుప్పల సూర్యారావు గారు మొదలైన ప్రముఖులు, కవులు, కవయిత్రులు పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments