సోమన్న రచించిన"అమ్ముల పొది" పుస్తకావిష్కరణ -అభినందనలు, ప్రవాహిని

సోమన్న రచించిన"అమ్ముల పొది" పుస్తకావిష్కరణ -అభినందనలు, ప్రవాహిని

సోమన్న రచించిన"అమ్ముల పొది" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన 40వ కొత్త పుస్తకం "అమ్ముల పొది" బాలగేయాల సంపుటి సామాజిక  సేవకురాలు,విశ్రాంత మండల విద్యాధికారిణి  శ్రీమతి హెచ్. రామలింగమ్మ మరియు ఆలూరు సబిన్స్పెక్టర్ డా.నాయక్   గారల చేతుల మీద  ఘాజి పబ్లిక్ స్కూల్,ఆలూరు నందు  ఘనంగా ఆవిష్కరించారు.పుస్తకాన్ని  మానవతావాది హెచ్.రామలింగమ్మ గారికి అంకితమిచ్చారు.అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు,ఉపాధ్యాయులు కళాకారులు డి. కేశవయ్య,ఆరెకటిక నాగేశ్వరరావు, బి.టి.లక్ష్మణ, రవి ప్రకాష్ ,నర్శిరెడ్డి ,పుర ప్రముఖులు, పాఠశాల సిబ్బంది మరియు పాత్రికేయులు     పాల్గొన్నారు.సన్మాన గ్రహీత కవిరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments