"జయహో చంద్రయాన్-3" పుస్తకావిష్కరణ -గద్వాల సోమన్న, రచయిత

"జయహో చంద్రయాన్-3" పుస్తకావిష్కరణ -గద్వాల సోమన్న, రచయిత

"జయహో చంద్రయాన్-3" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  రచించిన 41వ కొత్త పుస్తకం "జయహో చంద్రయాన్-3" బాలగేయాల సంపుటి విశ్రాంత ఫారెస్ట్ ఆఫీసర్   శ్రీ ఎ. ఎల్.కృష్ణారెడ్డి, విశ్రాంత భూగర్భ శాఖ డైరెక్టర్ డా.వి.డి. రాజగోపాల్,  శ్రీ గంటా మనోహర్ రెడ్డి మరియు విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీ గందె సోమశంకర్ గారల చేతుల మీద  హోటల్ కినర గ్రాండ్,ఎ. యస్.రావు నగర్,సికింద్రాబాద్ నందు  ఘనంగా ఆవిష్కరించారు.పుస్తకాన్ని  రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ కృష్ణారెడ్డి  గారికి అంకితమిచ్చారు.అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కవులు,ఉపాధ్యాయులు కళాకారులు డి. కేశవయ్య,ఆరెకటిక నాగేశ్వరరావు, రవీంద్ర బాబు ,శ్రీపాద శ్రీనివాస్ మరియు పాత్రికేయులు     పాల్గొన్నారు.సన్మాన గ్రహీత కవిరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments